అలనాటి ఆణిముత్యం గురించి అరుదైన సంగతులు

August 11, 2015 | 05:19 PM | 4 Views
ప్రింట్ కామెంట్
intresting_unknown_facts_about_sankarabharanam_niharonline

కమర్షియల్ హంగులు లేకున్నా ఘనవిజయం సాధించి అలనాటి ఆణిముత్యం శంకరాభరణం ఒక సంచలనం సృష్టించింది. 70వ దశకంలో మాస్ మసాలా చిత్రాల వెల్లువలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా రంగానికి అంతగా పేరులేని నటీ నటులతో రూపొందిన ఈ చిత్రం అఖండ ప్రజాదరణ సాధించటం విశేషం. ‘పాశ్చాత్య సంగీత పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక్క కాపు కాయడానికి తన చేతులడ్డు పెట్టిన ఆ మహానుభావులెవరో వారికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను’ అని చిత్ర చివర్లో శంకర శాస్త్రి చెప్పే డైలాగ్ ఆరోజుల్లో సంగీత పరిస్థితిని చెప్పకనే చెబుతుంది. ప్రతి తెలుగువాడి గుండె లోతుల్లోకి ఈ సినిమా వెళ్ళింది అని చెప్పటనికి ఇందులోని ప్రతి పాట నిత్య యవ్వనమై సజీవంగా ఇప్పటికీ వినిపించటమే అందుకు కారణం. సంగీతం గురించి ఇప్పుడు అప్పుడు చాలా తక్కువ మందికే తెలుసు, కానీ ఈ సినిమా చూసిన తరువాత పామరుని దగ్గరనుండి సంగీత విధ్వాంశులు దాకా శభాష్ అనిపిచ్చుకున్న ఏకైక తెలుగు సంగీత చిత్రం. ఈ చిత్రం గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం...

  • ఈ చిత్రం బాలీవుడ్ లో కూడా రీమేక్ అయ్యింది. 1985 లో హిందీ లో జయప్రద, గిరీష్ కర్నాడ్ లతో “సుర్ సంగం” గా రీమేక్ అయ్యింది. కానీ, అది అంతగా ఆడలేదు.
  • CNN – IBN వారు ప్రకటించిన ఎప్పటికి నిలిచిపోయే భారతీయ 100 అత్యుత్తమ చిత్రాల్లో స్థానం.
  • సినిమా విడుదలయ్యాక 35 ఏళ్లకు అంటే 2014 లో  ఈ చిత్రాన్ని తమిళ్ లో రిలీజ్ చేశారు. అప్పుడు కూడా ఆ చిత్రానికి మంచి ఆదరణ లభించింది.
  • సంగీత ప్రధానంగా సాగే చిత్రం కనుక ముందు బాలమురళీ కృష్ణ గారితో పాడిద్దం అనుకున్నారట, కాని సంగీత దర్శకుడు మహదేవన్ గారు నిర్మాతల నిర్ణయంతో విభేదించారట. పట్టుబట్టి మరి SP బాలసుబ్రమణ్యం గారిని ఎంచుకుని, చిత్ర యూనిట్ ను ఒప్పించి పాటలన్నీ ఆయనతో పాడించారట.  
  • 1981 ఫ్రాన్స్ బెసంకాన్ ఫిలిం ఫెస్టివల్ లో “ప్రజల బహుమతి (PRIZE OF THE PUBLIC)” గెలుచుకుంది.
  • తమిళ్, మలయాళం భాషల్లో అనువాదం అయి కూడా అపూర్వ ఆదరణ పొందింది.
  • విడుదల మొదటి రోజు కేవలం ఒక్క ధియేటర్ లో నే ప్రదర్శన జరిగింది, అది కూడా దాదాపు ఖాళీ.
  • ప్రఖ్యాత సమీక్షకుడు గుడిపాటి శ్రీహరి గారు “మాయా బజార్ తర్వాత అంతటి గొప్ప తెలుగు చిత్రం” అంటూ కీర్తించారు.  

ఇందులో నటించిన (జీవించిన ) నటీనటులు, సాంకేతిక నిపుణులు కు, దర్శక, నిర్మాత లకు మా నమ:సుమాంజలీలు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ