అజిత్ ‘ఎన్నయ్ అరిందాల్’ సినిమా ఫిబ్రవరి 5న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో ఏముందో, ఎందుకు బెదిరించారో తెలియదు గానీ, ఆ సినిమా రిలీజ్ చేస్తే థియేటర్లో బాంబుపెట్టి పేల్చేస్తామని ఓ లేఖ వచ్చింది. దీంతో చెన్నయ్ పోలీసులు అలర్ట్ అయిపోయి, థియేటర్ అణువణువూ స్కాన్ చేశారు. పోలీస్ డాగ్స్ ను రంగంలోకి దింపి వెతికించారు. అయితే ఈ బెదిరింపులు ఎవరు చేశారో అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ బెదిరింపులు ఎవరిని ఉద్ధేశించినవి అనేది కూడా ఇంకా తెలియలేదు. దర్శక నిర్మాతలమీద కక్ష సాధింపా? లేక హీరో అజిత్ మీదా? అనేది ఇంకా తెలియలేదు. అజిత్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేసిన ‘ఎన్నయ్ అరిందాల్’ (తెలుగులో ఎంతవారైన గానీ) చిత్రం కథ ఏమిటో తెలియదు కానీ, ఇందులో అనుష్క, త్రిష, అరుణ్ విజయ్ లు నటించారు. కాగా ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉందని కొంత పార్ట్ కత్తిరించినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. నిడివి ఎక్కువైందని కట్ చేశారా? లేక ఇందులో వివాదానికి సంబంధించిన ఏదైనా సీన్లు కట్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది.