చేసేది ఎవడు... చేయించేది ఎవడు?

November 20, 2015 | 04:00 PM | 2 Views
ప్రింట్ కామెంట్
brahmanandam_about_his_serial_flops_niharonline

టాలీవుడ్ లో మకుటం లేని కామెడీ కింగ్ గా చెలామణి అయ్యాడు బ్రహ్మానందం అలియాస్ బ్రహ్మీ. కమెడియన్లు ఎందరు ఉన్నా ఆయన ఉంటేనే అది సినిమా అవుతుంది అన్న రేంజ్ కి చేరిపోయాడు. ఫ్లాపులతో సతమతమవుతున్న ఎందరో హీరోలకి లైఫ్ ఇచ్చాడు. మరి అలాంటి బ్రహ్మీ కెరీర్ కే ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాల్లో బ్రహ్మానందం కామెడీ పెద్దగా పేలలేదనే విమర్శలు వస్తున్నాయి. ఆయన నటన ఒకే మాదిరిగా అనిపిస్తోందనే కామెంట్లు వినిపించాయి. ఈ విషయం పట్ల ఆయన స్పందిస్తూ, అందుకు తాను కారణం కాదని చెప్పాడు.

కొంతమందికి తన కామెడీ పాతగా అనిపించినంత మాత్రాన, మిగతా వాళ్లంతా ఆస్వాదించడం లేదని అనడం కరెక్ట్ కాదని అన్నాడు. రచయితలు తన బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకుని తన పాత్రను క్రియేట్ చేస్తారనీ, ఆ పాత్రలో తను ఎలా నటించాలనేది దర్శకులు చెబుతారని చెప్పాడు. దర్శకులు చెప్పిన విధంగా చేయడమే తనపని అని అన్నాడు. తాను పోషించిన విభిన్నమైన పాత్రలను గుర్తుపెట్టుకుని మరీ ప్రేక్షకులు ఇప్పటికీ నవ్వుకుంటున్నారనీ, తాను రొటీన్ పాత్రలను ఎంచుకోవడం లేదనడానికి ఇదే పెద్ద నిదర్శనమని చెప్పాడు. తన కామెడీని పెద్ద సంఖ్యలోని ప్రేక్షకులు ఇష్టపడుతూ వుండటం వల్లనే, తనకి ఇప్పటికీ అవకాశాలు వస్తూనే వున్నాయని చెప్పుకొచ్చాడీ సీనియర్ కమెడియన్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ