ఇద్దరమ్మాయిల్లో నటన కంటే ఎక్స్ పోజింగ్ తోనే ఎక్కువ పాపులర్ అయ్యింది కేథరిన్ తెస్రా. మత్తుకళ్లతో కిక్కెక్కించే అందాలతో యూత్ ను ఆకట్టుకుంది. అయితే ఎందుకో ఆ తర్వాత ఆ స్థాయి సినిమాలేవీ ఆమెకు రాలేదు. బన్నీ లాంటి స్టార్ హీరోయిన్లతో నటించేసింది ఇక ఆమె కెరీర్ దూసుకెళ్లిపోతుందని అంతా అనుకున్నారు. అయితే సీన్ రివర్స్ అయ్యింది. పైసా పెద్ద ఫలితం ఇవ్వలేకపోయింది. దీంతో తెలుగుకి ఫుల్ స్టాఫ్ పెట్టి కన్నడలో ఉపేంద్ర సరసన గాడ్ ఫాదర్ లో నటించింది. ఇక కోలీవుడ్ లో కార్తీ సరసన మద్రాస్ లో నటించింది. అయితే అమ్మడి అందాలకు మెచ్చి తమిళ చిత్రపరిశ్రమ మాత్రం బాగానే ఆదరించింది. అక్కడ వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూనే, తాజాగా బన్నీతోనే 'సరైనోడు' సినిమాలోను ఛాన్స్ కొట్టేసింది.
ఇక ఇప్పుడు ఈ అమ్మడికి బంఫర్ ఆఫర్ తగిలిందని చెప్పుకుంటున్నారు. కథానాయిక ప్రాధాన్యత గల ఒక సినిమాలో నటించేందుకు ఆమెకు కోటి రూపాయలు గాను ఆఫర్ చేశాడట ఒక తెలుగు సినిమా నిర్మాత. హై ఫై సొసైటీలోని అమ్మాయిల లైఫ్ స్టైల్ కి సంబంధించిన కథాంశంలో ఆమె నటించవలసి ఉంటుందని చెప్పాడట.
ఆ పాత్రకి గ్లామర్ డోస్ ఎక్కువగా ఉండటం, దానికి కేథరిన్ అయితేనే కరెక్టని సదరు నిర్మాత భావించాడట. ఇద్దరమ్మాయిలతో మూవీలో ఏ విధంగా అందాలను ఆరబోసిందో, దానికి మించిన అందాలను ఆ మూవీలో చూపించాలంట. మూవీ అంతా నిక్కర్ కాస్ట్యూమ్స్ తోనే ఉంటుందని చెప్పుకొచ్చాడంట. అయితే ఇలా చేసినందుకు కేథరిన్ థెరిస్సా కి కోటి రూపాయల రెమ్యునరేషన్ ని ఇస్తానని చెప్పుకొచ్చాడంట. సినిమా మొత్తం చిట్టి పొట్టి బట్టలతో ఆమె ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు హాట్ హాట్ సన్నివేశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది.