చెర్రీ సినిమాలో బ్రహ్మీ ఉన్నాడు

February 03, 2015 | 12:56 PM | 33 Views
ప్రింట్ కామెంట్

శ్రీనువైట్ల-రాంచరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో తమిళ హాస్యనటుడు సంతానం నటిస్తున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదనీ, ఆ స్థానం బ్రహ్మీదేనంటూ ఈ చిత్ర రచయితల్లో ఒకరైన గోపీమోహన్ వెల్లడించాడు. అంతకు ముందు బ్రహ్మీని తప్పించారంటూ, సినిమాకు వచ్చే క్రెడిట్ అంతా ఆయనకే వెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో అలా చేశారని రకరకాలుగా వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదనీ, ఈ సినిమా కొత్త కథతో తెరకెక్కుతుందనీ, మా శైలిలోనే హాస్యం ఉంటుందనీ, బ్రహ్మానందం కీలక పాత్ర చేస్తారని గోపీ మోహన్ సోషల్ నెట్వర్క్ లో ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి గోపీమోహన్-కోన వెంకట్ లు రచయితలుగా పనిచేస్తున్నారు. ఈ సినిమా కోసం శ్రీనువైట్ల-కోన వెంకట్లు కలిసి పని చేస్తారనీ, వీరిద్దరినీ రాంచరణ్ కలిపారని కూడా గోపీమోహన్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ