మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'బ్రూస్ లీ' లో తమిళ నటుడు అరుణ్ విజయ్ విలన్ గా చేసిన విషయం తెలిసిందే. ఈ నటుడు ఇప్పుడు చక్రవ్యూహ అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నాడట. షూటింగ్ జరుగుతుండగా హఠాత్తుగా కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్వయంగా ఆయనే సోషల్ నెట్ వర్కింగ్ మీడియా ద్వారా అభి మానులకు షేర్ చేశారు. ఈయనకు ముఖంపైన పలు చోట్ల గాయాలైనట్టు డాక్టర్ సర్టిఫికెట్ కూడా షేర్ చేశాడు. అరుణ్ విజయ్ నటుడు విజయ్ కుమార్ మొదటి భార్య సంతానం. అంతకు ముందు అరుణ్ 'ఎన్నై అరిందాల్'(ఎంత వారుగానీ) చిత్రంలో విలన్ గా నటించారు. తెలుగులో బ్రూస్ లీ తోనే మొదటి పరిచయం. ఈయన నటుడే కాదు నిర్మాత కూడా. 'ఇన్ సినిమాస్ ఎంటర్టైన్మెంట్' పేరుతో చిత్రాలు నిర్మిస్తున్నాడు. ఈ సంస్థ ద్వారా ఔత్సాహిక కళాకారులకు ఆయన అవకాశాలు ఇస్తున్నానని చెపుతున్నాడు.