నేను ఏనాడూ నీతి తప్పలేదు: శరత్ కుమార్

October 20, 2015 | 01:00 PM | 2 Views
ప్రింట్ కామెంట్
sharathkumar-speach-niharonline

ఈసారి నడిగర్ సంఘం ఎన్నికలు ఎన్నడూ లేని విధంగా పోటా పోటీగా జరిగాయి. విమర్శలు, ప్రతివిమర్శలు, తిట్లు, ఆఖరికి ఫైట్లు కూడా జరిగాయి.  ఈ నెల 18న జరిగిన ఎన్నికల్లో శతర్ కుమార్ వర్గం నాజర్, విశాల్ వర్గంతో ఓటమి పాలైంది. ఓటమి అనంతరం శరత్ కుమార్ మాట్టాడుతూ ఎన్నికల సందర్భంగా విశాల్ వర్గం వారు తన మీద చేసిన ఆరోపణలు, నిందలు తన మనసుని చాలా గాయపరిచాయని, తాను ఏనాడూ నీతి తప్పలేదని మీడియా వారితో చెప్పారు. 15 ఏళ్లుగా నడిగర్‌ సంఘం అభివృద్ధి కోసం, నటీనటుల సంక్షేమం కోసం పాటుపడ్డానని, 33 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న తాను ఏనాడూ తప్పు చేయలేదని, నడిగర్‌ సంఘం వ్యవహారంలోనూ ఎలాంటి తప్పు జరగలేదని స్పష్టం చేసారు. నడిగర్‌ సంఘం ఎన్నిలకు ప్రధాన కారణమైన ఎస్‌పీఐ సినిమాస్‌తో ఒప్పందాన్ని ఎన్నికలకు ముందే రద్దు చేసినట్లు ప్రకటించారు. ఎస్‌పీఐతో సంప్రదింపులు జరిపి సెప్టెంబర్‌ 29వ తేదీన ఒప్పందం రద్దుపై నిర్ణయం తీసుకున్నట్లు చెబుతూ అందుకు సంబంధించిన పత్రాలను చెన్నైలో సోమవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చూపించారు. ఎన్నికల ముందే ఈ విషయాన్ని ప్రకటించి ఉంటే నిజంగానే తాను తప్పు చేశానని అందరూ భావించి ఉండేవారని, తమ తొలి విజయంగా పాండవర్‌ ప్రచారం చేసేదని, అందుకే ఈ విషయాన్ని ఇప్పుడు వెల్లడిస్తున్నానని తెలిపారు. 10 రోజుల్లోపు సంఘం ఆడిట్‌ లెక్కలన్నీ నూతన కార్యవర్గానికి అప్పగిస్తానన్నారు. ఎస్‌పీఐతో ఒ ప్పందం అత్యుత్తమ ఆదాయ వనరుగా ఎప్ప టికీ తాను విశ్వసిస్తానని, ఈ విషయంలో కొత్త సభ్యులు పునరాలోచన చేయాలని సూచించారు. ఏదేమైనా నాజర్‌, విశాల్‌, కార్తి నేతృత్వంలోని కొత్త కార్యవర్గం చేపట్టే చర్యలకు తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ