వెరైటీ సినిమా కథలే కాదు పేర్లూ వెరైటీగానే పెడతాడు ఈ బాలీవుడ్ డైరెక్టర్ . సినిమా టైటిళ్ళతో పాటు ఆయన పేరు వెరైటీయే నండీ బల్కీ అంటే అదేదో నార్త్ లో పెట్టుకునే పేరేమో అనుకునేదు ఈయన అసలు పేరు బాలకృష్ణ. సరే డైరెక్టర్ దక్షిణాది మూలాలున్న వాడట. ఈయన తొలి సినిమా చీనీ కమ్ (అంటే చక్కెర తక్కువ అని అర్థం) ఈ సినిమా అప్పటిదాకా బాలీవుడ్ లో నడుస్తున్న ఫార్ములా ను బ్రేక్ చేసి మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ ‘పా’ కూడా భలే కథ భలే పాత్రలు అనిపించుకుంది. ఆపై ధనుష్ అమితాబ్ ప్రధాన పాత్రల్లో.. వారి పేర్లనే కలిపి ‘షమితాబ్’ అనే సినిమా తీసి మరో సంచలనం రేపాడు. ఇక ఇప్పుడు వస్తున్న కొత్త సినిమా విషయంలోనూ అక్కడి సినీ వాతావరణాన్ని కూడా మార్చేస్తున్నాడు. ఎప్పుడూ రిహార్సల్స్ అనే మాట తెలియని నటులు కూడా ఈ సినిమా కోసం రిహార్సల్స్ చేస్తున్నారంటే ఆలోచించాల్సిందే. ఈసారి కూడా ఓ చిత్రమైన టైటిల్ తో ఎంచుకున్నాడు. ‘కీ అండ్ కా’ అట. ఇదేం టైటిల్ అని ముఖాలు చిట్లిస్తున్న వారికి ఈ మధ్యే యూనిట్ వర్గాలు క్లారిటీ ఇచ్చారట. కీ అంటే లడకి కా అంటే లడకా.. షార్ట్ కట్ లో కీ అండ్ కా అని టైటిల్ పెట్టారట. ఇదేంటో కా భాష లాగా ఉంది కదా... ఈ సినిమాలో అర్జున్ కపూర్ కరీనా కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఐతే అర్జున్ తో పోలిస్తే కరీనా వయసులో పెద్ద. మరి వీళ్లిద్దరికీ జోడీ కుదిర్చాడంటే ఇదేదో మరో విభిన్నమైన సినిమా అయి ఉంటుందని తెలుస్తోంది. సరే... సినిమా తెరమీదకు వచ్చే వరకూ వెయిట్ చేద్దాం...