గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న ఛార్మి మంత్ర 2 ఎలాంటి ఆర్భాటం లేకుండా, ప్రకటనలూ లేకుండా గుట్టుగా విడుదల చేశారు. ఈ చిత్రం శుక్రవారం (31 జులై) రిలీజైంది. మరీ మీడియాకూ పెద్ద ప్రచారం లేకుండా ఎందుకు విడుదల చేశారో అర్థం కావడం లేదు. అయితే నిర్మాతలు మాత్రం ఇంతకుముందే ఇది మంత్ర ఫస్ట్ పార్ట్‌కు సీక్వెల్ కాదని చెప్పారు. రవితేజ, బోనాల శ్రీకాంత్ తేజఫిల్మ్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సస్పెన్స్ హారర్ చిత్రానికి కొత్త దర్శకుడు ఎస్వీ సురేష్ మెగా ఫోన్ పట్టుకున్నాడు. కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తీశామన్నారు. నిర్మాతలు. ఇందులో ఛార్మితోబాటు చేతన్, తనికెళ్ల భరణి, రాహుల్‌దేవ్, వేణుమాధవ్ కీలక పాత్రలు పోషించారు. ఓ నగరం బయట నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న బంగళాలో ఏం జరుగుతుందన్నదే ఈ సినిమా కథ కొనసాగుతుందట. ఈ సినిమా టాక్ ఏ విధంగా ఉందనేది మరికొద్ది సేపట్లో తేలి పోతుంది.