టాలీవుడ్ పై అసంతృప్తి వెల్లగక్కిన సెక్సీబ్యూటీ

March 24, 2016 | 04:05 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Catherine-Tresa-worried-about-tollywood-niharonline

గ్లామర్ విషయంలో ఇప్పుడున్న కథానాయికలలో కేథరిన్ తెస్రా ఎవరికీ తీసిపోదు. ఆకర్షణీయమైన రూపంతో... మత్తెక్కించే కళ్లతో హాట్ హాట్ గా ఇట్టే ఆకట్టుకుంటుంది. కుర్రకారు ఆమె చక్కదనానికి ఫిదా అయిపోయినా, ఆమెకి ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు. 'ఇద్దరమ్మాయిలతో' కాస్తంత గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ప్రస్తుతం 'సరైనోడు' సినిమాలోనూ రెండవ కథానాయికగానే నటిస్తోంది.

                         తెలుగులో సరైన గుర్తింపు రాకపోవడంతో కేథరిన్ చాలా ఫీలవుతోందట. కన్నడ, మలయాళ సినిమాల్లోను మెప్పించిన తనకి, ఇటీవల తమిళం సినిమాల్లోను మంచి క్రేజ్ లభించింది. కార్తీతో మద్రాస్, విశాల్ తో కథకళి చిత్రాల హిట్లతో మంచి అవకాశాలు లభిస్తున్నాయి కూడా. తెలుగులో మాత్రం కేవలం గ్లామర్ పాత్రలకి మాత్రమే అడుగుతున్నారనీ, అదీ రెండవ కథానాయికగా మాత్రమే అవకాశం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నటనకి అవకాశం వుండే విభిన్నమైన పాత్రలను చేయాలని వుందనీ, తెలుగులో అలాంటి ఛాన్స్ రావడం లేదని వాపోయింది. తన టాలెంట్ ను గుర్తించి మున్ముందు అలాంటి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నానంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. కేథరిన్ కోరిక తీరే అవకాశం త్వరలో దక్కాలని ఆశిద్దాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ