తమిళనాట తలైవా రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి స్టార్ డమ్ ఉన్న నటుడు ఇళయదళపతి విజయ్. తొటినటుడు అజిత్ పోటీకి వచ్చినప్పటికీ మాస్ లో విజయ్ కి ఉన్న క్రేజ్ చాలా ఉంది. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనప్పటికీ అభిమాన సంఘాల పేరుతో విజయ్ ఫ్యాన్స్ చేసే హడావుడి అంతకన్నా ఎక్కువే ఉంటుంది. అలాంటి విజయ్ పై నోరు జారిన పాపానికి ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
చైనాకు చెందిన ప్రఖ్యాత కమ్యూనిస్టు నేత మావో జెడాంగ్ ను రష్యా నాయకుడంటూ తమిళనటుడు విజయ్ వ్యాఖ్యానించాడు. దీంతో, నెటిజన్లు విజయ్ పై చమక్కులు పేలుస్తున్నారు. ‘తమిళనాడు రాహుల్ గాంధీ’, ‘వినోదం అందించడంలో విజయ్ పులి లాంటి వాడు, లోకజ్ఞానం విషయంలో ఎలుక’, ‘ఇంకా నయం, మావోను అమెరికా అధ్యక్షుడనలేదు’, ‘విజయ్ లాంటి వారు రోల్ మోడల్ గా ఉండటం అవమానకరం’ అంటూ మొదలైన విమర్శలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. ఇంతకీ, మావో జెడాంగ్ గురించి ఏ సందర్భంలో ప్రస్తావించాండో తెలుసా తన తాజా చిత్రం ‘తెరీ’ ఆడియో పంక్షన్లో.