కేంద్ర సెన్సార్ బోర్డ్ ప్రస్తుత చైర్మన్ పహ్లాజ్ నిహలాని విడుదల చేసిన ఒక సర్క్యులర్‌లో మప్ఫై ఇంగ్లీషు, హిందీ పదాల్ని ఇక ఏ భాషాచిత్రంలో ఉపయోగించరాదని ఆర్డర్స్ జారీ అయినట్టు సమాచారం. ఈ ఉత్తర్వుపై చిత్రపరిశ్రమల్లో భిన్న స్పందనలు మొదలయినట్టు, ప్రస్తుత సెన్సార్ బోర్డులో కేంద్ర అధికార పార్టీ ఆర్.ఎస్.ఎస్, వి.హెచ్.పి కల్పించుకోవడం వల్లనే ఈ విధమైన నిబంధనలు అమల్లోకి వస్తున్నట్టు సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.