36 ఏళ్ళ గాన సౌరభం - శంకరాభరణం

August 05, 2015 | 02:11 PM | 3 Views
ప్రింట్ కామెంట్
chaganti_about_shankarabaranam_niharonline

ఒక ఆధ్యాత్మిక వేత్త ఒక సినిమా గురించి విశ్లేషించడం బహుశా ఇదే ప్రథమం కావచ్చు. దర్శకుడు విశ్వనాథ్ సినిమాలకు అలాంటి అరుదైన గౌరవం దక్కింది. కాకినాడకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆగస్టు 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోని శ్రీసత్య సాయి నిగమాగమంలో సాయంత్రం 6 గంటలకు 'శంకరాభరణం' చిత్రానికి విశ్లేషణ ప్రవచనం ఇవ్వనున్నారు. శంకరాభరనం సినిమా వచ్చి ఇప్పటి 36 ఏళ్ళు అయ్యింది. అంటే మూడు పుష్కరాల కాలం. 36 ఏళ్ళ సామ గాన సౌరభం - శంకరాభరణం' శీర్షికన జరగనున్న ఈ కార్యక్రమ వివరాలను 'శంకరాభరణం' దర్శకులు కె. విశ్వనాథ్, కార్యక్రమ నిర్వాహకులైన శ్రీనివాస్, శ్రీధర్‌లు మంగళవారం వివరించారు.
కె విశ్వనాధ్ గారు మాట్లాడుతూ... ''సుందరకాండ, రామాయణ, భారతాల లాగా గురుశిష్య సంబంధమైన 'శంకరాభరణం' గురించి ఒక సప్తాహం చేయగలనని పదేళ్ళ క్రితమే చాగంటి వారు నాతో అన్నారు. ఆ ప్రశంస నాకు 'భారత రత్న', 'పద్మవిభూ షణ్'లను మించినది. అప్పటి ఆ మాటను ఆయనిప్పుడు నిజం చేస్తున్నారు. ఈ ప్రవచన రూప విశ్లేషణతో ఒక సినిమాకు అచ్చమైన కావ్యగౌరవం ప్రసాదిస్తున్నారు'' అని చెప్పారు. అనంతరం మీడియా వారితో మాట్లాడారు. ‘‘ఇప్పటికే ప్రపంచమంతా గౌరవించడం 'శంకరాభరణం'కు దక్కిన అమ్మ ఆశీర్వాదం లాంటిదైతే, ఇప్పుడీ చాగంటి వారి ప్రవచనం పండితుల ఆశీర్వాదం లాంటిదని విశ్వనాథ్ అన్నారు. మొదటి ఆశీర్వాదం ఈ సినిమాకు ఎప్పుడో దక్కినా, ఇప్పుడీ రెండో ఆశీర్వాదం అంతకు మించినదని అభిప్రాయ పడ్డారు. 'సాగరసంగమం', 'స్వర్ణ కమలం' లాంటి ఇతర సినీ కావ్యాలపై కూడా సమగ్రమైన విశ్లేషణ జరిగితే, మరింత మందికి వాటిలోని అంతరార్థాలు తెలియవచ్చని ఆయన వ్యాఖ్యా నించారు. కార్యక్రమం చివరి రోజున చాగంటి గారు తన గురువులైన మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్‌ను సత్కరిస్తే, గాయకులు డి.వి. మోహనకృష్ణ తన గురువైన మంగళంపల్లి బాలమురళీకృష్ణను గౌరవించనున్నారు. త్రిపుష్కరోత్సవ ప్రత్యేక గీతం... నృత్యం... ఈ సందర్భంగా 'శంకరాభరణం త్రిపుష్కరోత్సవ గీతం' పేరిట రచయిత రాంభట్ల నృసింహశర్మ ప్రత్యేకంగా పాట రాయడం విశేషం. 

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ