ఇప్పుడు బాహుబలి సినిమా 500 కోట్ల కలెక్షన్ క్రాస్ చేయడం మన తెలుగు వారందరూ గర్వించ దగిన అంశం. కానీ ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ ‘మగధీర’ గుర్తుకు వస్తుందనడంలో అతిశయోక్తి లేదు. కారణం ఆ సినిమాకూడా చాలా బాగుంది కానీ, ఇంత కలెక్షన్ రాకపోవడానికి కారణమేంటని అనిపిస్తుంది. అయితే ఈ విషయమై రాజమౌళి మాట్లాడుతూ ‘మగధీర' సినిమాకు కూడా భారీ వసూళ్లు సాధించి అప్పట్లో తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టింది. ఈ సినిమా తీసినప్పుడు దీన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని నిర్మాత అల్లు అరవింద్‌కు సూచించానని, కానీ తెలుగులో విడుదలైన సంవత్సరం తర్వాత తమిళంలో రిలీజ్ చేశారన్నారు. అయినప్పటికీ రూ.4 కోట్ల వరకు వసూళ్లు చేసింది. తాను చెప్పినట్లు చేస్తే మగధీర వసూళ్లు మరింత పెరిగి ఉండేవని రాజమౌళి తెలిపారు. ఇక బాహుబలి విషయానికి వస్తే, బాలీవుడ్ సినిమాల తరువాత ఇంతటి కలెక్షన్ వచ్చిన ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటి వరకు అమీర్ ఖాన్ నటించిన ధూమ్ 3, పికె చిత్రాలు మాత్రమే ఆ ఘనత సాధించాయి.