గత కొన్ని రోజులుగా ఆయన మరణంపై భార్య, తల్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుని వార్తలకెక్కారు. అయితే చక్రి మృతిపై వచ్చిన అనుమానాలన్నిటికీ చెక్ పడింది. ఆయనది సహజ మరణమేననీ, అస్థికల్లో ఎలాంటి విష పదార్థాలు లేవని ఫోరెన్సిక్ పరీక్షల్లో వెల్లడైంది. చక్రి అస్థికలను పరిశీలించి, పరీక్షించిన ఫోరెన్సిక్ నిపుణులు ఈ మేరకు నివేదిక రూపొందించారు. చక్రి మరణంపై అనుమానం ఉందంటూ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అత్త తదితరులే చక్రిని చంపారంటూ భార్య శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ప్రతిగా అతని తల్లి, తమ్ముడు, అక్క కూడా ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని కోడలే చంపిందని చక్రితల్లి కూడా పోలీసులకు ఫర్యాదు చేశారు.