మొహంజదారో మిస్ అయ్యాడట....

August 28, 2015 | 02:20 PM | 2 Views
ప్రింట్ కామెంట్
ramcharan_desire_to_act_bollywood_movie_niharonline

రాంచరణ్ బాలీవుడ్ లో జంజీర్ అనే చిత్రంలో చేసినప్పటికీ ఆ సినిమా అంతగా ఆడలేదు. దాంతో ఎలాగైనా  బాలీవుడ్ లో ఓ హిట్ కొట్టాలనే కోరికతో ఉన్నాడట. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వం లో ఓ చిత్రం లో నటిస్తున్న రామ్ చరణ్ మరి తదుపరి చిత్రం గురించిన ముచ్చట్లేవీ లేకపోవడంతో సొంత బేనర్ లో బాలీవుడ్ సినిమా ఆలోచనలేమైనా చేస్తున్నాడేమో అని అనుకుంటున్నారు సినీ అభిమానులు. తండ్రి 150వ సినిమా తీసేందుకు సిద్ధమైన రాంచరణ్... మరి తన కోసం కూడా ఏదైనా కథ రెడీ చేసుకుంటున్నాడేమో...  ప్రస్తుతం అశుతోష్ గోవరికర్ దర్శకత్వం లో హృతిక్ రోషన్ మెహొంజొదరొ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఆ సినిమా కోసం అశుతోష్ ముందు రాం చరణ్ నే అడిగాడని చెపుతున్నాడు. తనకు డేట్స్ కుదరక పోవడం తో ఆ సినిమా చేజారి పోయిందని అంటున్నాడు. అంటే మళ్ళీ అవకాశం వస్తే బాలీవుడ్ సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడన్న మాటేగా. అలాంటి ఆఫర్లు రాకపోతే తనే ఓ సొంత సినిమా చేసుకుంటే పోలా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ