మెగా స్టార్ మాట మార్చడం వెనుక....?

September 11, 2015 | 02:47 PM | 2 Views
ప్రింట్ కామెంట్
chiranjeevi_top_dancer_niharonline

మగధీరలో ‘బంగారు కోడి పెట్ట’ రిమిక్స్ తో చరణ్ డాన్స్ చేసినప్పుడు చిరంజీవి అప్పుడన్న మాట మరిచినట్టున్నాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఇంటర్వ్యూలో డాన్స్ లో తనే టాప్ అంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. మరి అప్పటి ఇంటర్వ్యూలో చెప్పిన మాట సంగతేమిటండీ అని కొందరు క్రిటిక్స్ విమర్శలు చేస్తున్నారు. ‘‘అప్పటి మీ పాటకు ఇప్పుడు చరణ్ స్టెప్స్ చూస్తే మీకేమనిపిస్తుంది?’’ అని ఇంటర్వ్యూలో అడిగితే ‘‘దానికీ దీనికీ పొంతనే లేదు... చరణ్ చాలా బాగా చేశాడు’’ అంటూ అప్పుడు తనయుణ్ణి తెగ పొగిడేశాడు. అంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతారా చిరంజీవి? అయినా ఇప్పుడు టాలీవుడ్ లో డాన్స్ తో అదరగొట్టే హీరోలు చాలా మందే ఉన్నారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్... తనయుడు కూడా ఓకే.... వీళ్ళంతా స్టెప్స్ తో అదగొట్టే వాళ్ళే... మరి తనకన్నా గొప్ప వాళ్ళు లేరంటూ చిరంజీవి ఇలా చెప్పుకోవడం ఏంటని అనుకుంటున్నారంతా... ఇక్కడ చిరు స్ట్రాటజీ మరొకటి కూడా ఉండొచ్చు. తన కొడుకు బాగా చేస్తాడంటే, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఫాన్స్ ఊరుకోకపోవచ్చు.... తనయుణ్ణి కాదని పక్కవాళ్ళు బాగా చేస్తారని చెప్పడమూ బాగోదు. అందుకే ఆయన ఇలా చెప్పి ఉండవచ్చు.
సరే అయినప్పటికీ చిరు అలా మాట్లాడ్డం పై కొందరి హీరోల ఫాన్స్ కూడా తెగ బాధ పడిపోతున్నారట. వారికి చిరు ఒపీనియన్ నచ్చలేదు.  చిరంజీవి డాన్స్ బాగా చేస్తాడంటే ఒప్పుకోవచ్చు కానీ టాలీవుడ్ లో ఆయనే టాప్ డాన్సర్ అంటేనే మింగుడు పడకుండా ఉంది కొందరికి. ఒకే ఆయన ఓపినియన్ ఆయనది... ఎవరు గొప్ప అని తేల్చాలంటే ఏ ఛానల్ వాళ్ళయినా ఓటింగ్ తో తేల్చాలి మరి.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ