మన హీరోయిన్లలో చాలా మంది ఇలా ఇండస్ట్రీకి వచ్చారో లేదో ఓ రెండు మూడు సినిమాలు చేయగానే బాడీ పెరిగిపోతుంటుంది. బరువు పెరగ కుండా ఉండడానికి ఎన్నెన్నో కసరత్తులు చేస్తూ అందం కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ త్రిషను చూడండి అప్పుడూ ఇప్పుడూ ఒకేలా కనిపిస్తుంది. తమన్న హాపీడేస్ లో ఎంత నాజూగ్గా ఉంది... రెండు మూడు సినిమాలకే డైట్ కంట్రోల్ లోకి వెళ్ళిపోయింది... ఆ మధ్య ఒక నెల రెస్ట్ తీసుకొని బోండాంలా తయారై మీడియా కెమెరాకు చిక్కింది. దాదాపు అందరూ అంతే... కానీ త్రిషకు తన బాడీ గాడ్ గిఫ్ట్ లా ఉంది. ఆమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 15 ఏళ్ళు అవుతోంది. ఇంత లాంగ్ పీరియడ్ హీరోయిన్లు గా కొనసాగడం ఇప్పటి పరిస్థితుల్లో అయ్యే పని కాదు. కానీ త్రిష అన్ని భాషల్లోనూ స్టార్ హీరోలతో ఇప్పటికీ నటిస్తూనే ఉంది.
అయితే త్రిషకు ఓ హార్రర్ మూవీ చేయాలనే కోరిక మిగిలిందట. అది తీరే అవకాశం వచ్చింది ఇప్పుడు `నాయకి` అనే ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ కోసం నిన్న హైదరాబాద్ కు వచ్చింది. ఆమెలో ఏ మాత్రం తరగతి అందాన్ని చూసి అందరూ మీడియా, సినీ ప్రముఖులు నోళ్ళు వెళ్ళ బెట్టారట. ఆమె వేసుకున్న డ్రెస్ కూడా సూపరంటూ మెచ్చుకున్నారంతా. ఏంటి ఇంత అందంగా తయారవుతున్నారు అని త్రిషని అడిగితే, ‘‘ఎప్పుడు హ్యాపీగా ఉండటమే నా బ్యూటీ సీక్రెట్’’ అని చిరునవ్వులూ చిందిస్తూ సమాధానమిచ్చిందట.
ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ మన సంతోషం మనని చాలా అందంగా ఉంచుతుందనేది అందరికీ తెలిసినా పాటించడం ముఖ్యం కదా... అది త్రిష చేస్తోంది. మనసులో ఎన్ని సమస్యలున్నా వాటిని డెప్త్ లోకి వెళ్ళ నివ్వకుండా... ఆనందంవైపు పరుగులు పెడుతోంది. త్రిష పెళ్ళి విషయం ఎంత లైట్ గా తీసుకుందనేది దీన్ని బట్టి తెలుస్తుంది. తెలివైన త్రిష ఇప్పుడు సినిమాల్లో బిజీ బిజీగా ఉంటూ `నాయకి` తో తన చిర కాల కోరిక కూడా తీర్చుకోబోతోంది. తను ఈ కథ ఓ ఐదు నిమిషాలే విని ఒప్పేసుకుందట. హీరోయిన్లందరూ త్రిషను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే అందం, ఆనందం వారి వెన్నంటే ఉంటాయెప్పుడూ...