చిరంజీవి 150 సినిమా మొదలు పెట్టక ముందే పూరీ జగన్నాథ్ మరో సినిమాకు కమిట్ అయ్యాడనే వార్త రాగానే... ఏంటీ ఈ డైరెక్టర్ ధైర్యం అనుకున్నారు. ఇప్పటికే పలు వార్తలు ఊహాగానాలు వస్తున్న సమయంలో మరో షాకింగ్ న్యూస్ ప్రచారం జరుగుతోంది. చిరంజీవి ఈ సినిమాను ఎంతో ప్రిస్టేజియస్ ప్రాజెక్టుగా భావిస్తున్నట్టు, అలాగే ఫాన్స్ కూడా ఈ సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో ఉండడంతో చిరు సినిమాకు డైరెక్టర్ పూరీ అని ప్రకటించడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఈ డైరెక్టర్‌ను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పిస్తున్నారని గట్టిగా వినిపిస్తోంది. రెండు నెలల్లో సెట్స్‌కు వెళ్ళే ఈ చిత్రాన్ని పూరీ లైట్‌గా తీసుకుంటున్నాడని, ఈలోగా వరుణ్ తేజ్‌తో సినిమా చేయడానికి సన్నాహాలు చేయడమే ఇందుకు కారణమని ఓ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ‘డెక్కన్ క్రానికల్’ రాసుకొచ్చింది. అయితే ఈ సినిమా నితిన్ తో చేయాల్సి ఉండగా... సడన్ గా హీరో కూడా మారినట్టు తెలుస్తోంది.
అసలు చిరు సినిమా దక్కడమే బంపరాఫర్ ఐతే, మధ్యలో నితిన్ మూవీ ఒప్ప్పుకోవడం, విభేదాలతో ఆ ప్లేస్‌లో వరుణ్‌ను రీప్లేస్ చేయడం అవసరమా అని మెగా క్యాంప్ ఫీల్ అవుతున్నట్టు సమాచారం. నితిన్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయితే చిరు 150వ సినిమా మీద మరింతగా కాన్సంట్రేట్ చేయొచ్చుగా అనే కామెంట్స్ లేకపోలేదు. తన రెగ్యులర్ స్టైల్లో పూరీ ఈ చిత్రాన్ని స్పీడ్‌గా తీసేసి మహేష్‌తో న్యూ ప్రాజెక్ట్‌కి రెడీ అవుతాడని మెగా క్యాంప్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులోభాగంగానే గురువారం చిరు- వినాయక్ భేటీ జరిగిందని, దీంతో పూరీని తప్పించే సూచనలు కనిపిస్తున్నాయని ఇన్ సైడ్ న్యూస్.