సీన్స్ నేచురల్ గా ఉండడానికి సినిమా వాళ్ళు చాలా చాలా ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. హీరోయిన్ లేదా హీరో ముఖంలో నేచురల్ కోపం... చిరాకు రావడానికి డైరెక్టర్లు వారికి నిజంగా చిరాకు తెప్పించడానికి... అప్పటికప్పుడు ఎన్నో ఉపాయాలు చేస్తుంటారు. హీరోయిన్ ని ఏడిపించడానికి గతంలో ఓ డైరెక్టర్ చెంపమీద ఒక్కటిచ్చుకున్నాడట... ఇంత వరకు బాగానే ఉంది కానీ. బల్కీ తీయబోయే చిత్రంలో భార్యభర్తలు ఎంత ప్రేమగా ఉండాలో అంతలా గొడవ పడాలట... దాని కోసం హీరో అర్జున్ కపూర్ ను, హీరోయిన్ కరీనా కపూర్ ను ఒక రోజంతా గదిలో బంధించాడట... అయితే వాళ్ళు భార్యభర్తలు కాదు కదా... ఇదేంటి? అలా బంధిస్తే ఏ బంధం లేని వాళ్ళెలా పోట్లాడుకుంటారు? కాస్త వినడానికి విడ్డూరంగానే ఉంది. అర్జున్ కపూర్ కు బదులు సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ను తీసుకుంటే సీన్లు బాగా పండేవేమో కదా! ఈ జంట సాఫ్ట్ జంట అయినప్పుడు షాహిద్ కపూర్ నైనా తీసుకోవచ్చు కదా? ఇలా సంబంధం లేని వారిని గదిలో బంధించి గొడవపడమనడమేంటండీ బాబూ? కరీనా-అర్జున్ కపూర్లను సినిమాకోసం చిత్రదర్శకుడు ఆర్. బాల్కీ ఓ గదిలో బంధించేశాడట. రోజంతా ఒకే గదిలో బంధీలుగా ఉండి, ఇద్దరూ చిరు కోపాలు, అలకలు ప్రదర్శించుకోవాలన్న మాట. పెద్ద పెద్ద గొడవలు కూడా పడాలి. అప్పుడే షూటింగ్‌లో సరిగ్గా చేయగలుగుతారన్నది బాల్కీ అభిప్రాయం. దాదాపు ఐదు రోజుల పాటు వీళ్లిద్దరూ ఇలా గదిలో బంధీలుగా ఉండాలట... ఏమిటో బాలీవుడ్ సినిమాల తెరవెనుక, తెరపై రిలేషన్లు...