‘రుద్రమదేవి’కి చిరంజీవి వాయిస్ ఓవర్...

June 15, 2015 | 12:35 PM | 0 Views
ప్రింట్ కామెంట్
chiranjeevi_gunashekar_rudrama_voice_over_niharoline

అగ్ర కథానాయిక అనుష్క టైటిల్‌ రోల్‌లో గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై శ్రీమతి రాగిణీి గుణ సమర్పణలో డైనమిక్‌ డైరెక్టర్‌ దర్శక నిర్మాతగా రూపొందుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ 3డి ద్విభాషా చిత్రం ‘రుద్రమదేవి’. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటివరకు తెలుగు చలనచిత్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో తెరకెక్కిన ఈ చారిత్రాత్మక చిత్రానికి మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్‌ ఇచ్చారు. 
ఈ సందర్భంగా దర్శకనిర్మాత గుణశేఖర్‌ మాట్లాడుతూ ‘‘భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియో స్కోపిక్‌ 3డి చిత్రంగా ఎంతో భారీ వ్యయంతో రూపొందుతున్న మా ‘రుద్రమదేవి’ చిత్రానికి మెగాస్టార్‌ చిరంజీవిగారు వాయిస్‌ ఇచ్చారు. దీనికి సంబంధించిన రికార్డింగ్‌ కూడా పూర్తయింది. హిందీ చిత్రం ‘లగాన్‌’కి అమితాబ్‌ బచ్చన్‌ వాయిస్‌ ఓవర్‌ ఎంతటి హైలైట్‌ అయినట్టే, మా చిత్రానికి చిరంజీవిగారి వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడంతో సినిమాకి ఇంకా హైప్‌ వచ్చింది. ఈ భారీ చారిత్రాత్మక చిత్రానికి చిరంజీవిగారు ఇచ్చిన వాయిస్‌ ఓవర్‌ ఓ స్పెషల్‌ అట్రాక్షన్‌ అవుతుంది. మా చిత్రానికి చిరంజీవిగారి వాయిస్‌ ఓవర్‌ అడగ్గానే ఆయన అంగీకరించి వెంటనే దానికి సంబంధించిన రికార్డింగ్‌ కూడా పూర్తి చేయడానికి సహకరించిన చిరంజీవిగారికి స్పెషల్‌ థాంక్స్‌ తెలియజేస్తున్నాను’’ అన్నారు. 
రుద్రమదేవిగా అనుష్క నటించిన ఈ ప్రెస్టీజియస్‌ మూవీలో గోనగన్నారెడ్డిగా స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌, రానా, కృష్ణంరాజు, సుమన్‌,   ప్రకాష్‌రాజ్‌, నిత్యమీనన్‌, కేథరిన్‌, ప్రభ,  జయప్రకాష్‌రెడ్డి,  ఆదిత్య మీనన్‌, ప్రసాదాదిత్య, అజయ్‌, విజయ్‌కుమార్‌, వేణుమాధవ్‌, ఉత్తేజ్‌, వెన్నెల కిషోర్‌, కృష్ణభగవాన్‌, ఆహుతి ప్రసాద్‌, చలపతిరావు, శివాజీరాజా, సమ్మెట గాంధీ, ఆదితి చెంగప్ప, సన, రక్ష తదితర నటీనటులు ముఖ్యపాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి సంగీతం: మేస్ట్రో ఇళయరాజా, ఆర్ట్‌: పద్మశ్రీ తోట తరణి, ఫోటోగ్రఫీ: అజయ్‌ విన్సెంట్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: నీతా లుల్లా(జోధా అక్బర్‌ ఫేం), ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌,  వి.ఎఫ్‌.ఎక్స్‌. సూపర్‌వైజర్‌: కమల్‌ కణ్ణన్‌(ప్రసాద్‌ ఇ.ఎఫ్‌.ఎక్స్‌.), మాటలు: పరుచూరి బ్రదర్స్‌, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌, కాస్ట్యూమ్స్‌: వి.సాయిబాబు, మేకప్‌: రాంబాబు, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బెజవాడ కోటేశ్వరరావు,  ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కె.రామ్‌గోపాల్‌, సమర్పణ: శ్రీమతి రాగిణీ గుణ,  కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: గుణశేఖర్‌.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ