మా అధ్యక్షుడు హుందాగా ప్రవర్తించాలి

April 18, 2015 | 01:12 PM | 21 Views
ప్రింట్ కామెంట్
jayasudha_about_rajendraprasad_niharonline

మా అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగి ప్రచారం మొదలుకుని, ఎన్నికల నిర్వహణ, తదనంతరం కోర్టు విచారణల వరకు బాగా యాక్టివ్‌గానే కనిపించిన సహజ నటి జయసుధ శుక్రవారం కౌంటింగ్ సమయంలో మాత్రం కనిపించకుండా పోయారు. ఇక్కడెవరూ గాజులు తొడుక్కుని లేరు అంటూ ప్రత్యర్థులకు సవాళ్లు విసిరిన ఆమె ఎందుకు కనిపించడం లేదని  అనుకుంటుండగా... శనివారం ఆమె నోరు విప్పారు.  గెలుపొందిన రాజేంద్ర ప్రసాద్ కు ఆమె అభినందనలు తెలిపి... కౌంటింగ్ పూర్తయిన తరువాత ఆయన మాట్లాడిన విధానానికి బాధపడుతూ... ఆయన ఓ హాస్యనటుడు... ఆయన ప్రవర్తించే తీరు కూడా అదే విధంగా ఉందని ఘాటుగా స్పందించారు. రాజేంద్రప్రసాద్ బాధ్యతగల పదవి చేపట్టారనీ... హుందాగా ప్రవర్తిస్తే బాగుంటుందని హితవు పలికారు. తోటి నటులను అంత చులకనగా తీసి పారేయడం తగదని అన్నారు. ఇక నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్వ హించే ఏ కార్యక్రమానికీ తాను హాజరు కాననీ, కానీ ఆర్టిస్టులకు ఏ సహాయం చేయాలన్నా...వారికి బయటి నుంచి సహాయం అందిస్తానని అన్నారు. కొన్ని కారణాలు తనను తీవ్రంగా బాధించాయని అందుకే ఇక నుంచి మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ప్రొగ్రామ్స్ లో నేను పాల్గొనబోనని చెప్పారు.

    తాను ఒక రోజు ముందు నామినేషన్ వేసాననీ, ఎక్కువగా ప్రచారంలో పాల్గొనలేకపోయాననీ, అయినా 150 ఓట్లు గెలుచుకున్నాననీ, ఇది తనకు నైతిక విజయం అని ఆమె అన్నారు. తన ప్యానెల్లో 22 మంది గెలుపొందారనీ ఇది కూడా తన విజయంగానే భావిస్తున్నానని అన్నారు. ఎన్నికైన కొత్త అధ్యక్షుడు బాధ్యత నెరిగి తాను చేసిన హామీలు నెరవేర్చాలని ఆమె కోరారు. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ