ఇది చాలా వింతగా అనిపిస్తోంది. జనం పోకడకు నవ్వొస్తోంది కూడా. మూడు నాలుగు రోజులుగా నయనతార బీరుకొంటున్నట్టున్న ఒక వీడియో క్లిప్పింగ్ సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తోంది. దీని గురించి పత్రికలు, చానళ్ళు, వెబ్ పోర్టల్స్ కూడా వార్తలు ప్రచురించాయి. లాజిక్ గా ఆలోచిస్తే అంత పెద్ద తార బీరు కొనడానికి వైన్ షాపుకు వెళ్తుందా? తెప్పించుకోడానికి ఆమె అసిస్టెంట్లు ఎవరూ ఉండరా? అయినా ఈ వీడియో క్లిప్పింగ్ తో రాద్దాంతం చేయడమేంటి? ఆమె కొంటే ఏమిటట? అది ఆమె పర్సనల్... దానికి ఆవిడ పోస్టర్లు తగులబెట్టడం ఏమిటి? పవిత్రమైన పాత్రల్లో నటించే వాళ్ళంతా పవిత్రంగా ఉండాలనే సిద్ధాంతం ఏమైనా ఉందా? నయనతార సీతమ్మ కాదు కదా? పోనీ సీతమ్మయితే గుడికట్టి పూజలు ఏమీ చేయడం లేదు కదా ఆమెకు? ఈ వీడియో చూసి హిందూ మక్కల్ కచ్చి (హెచ్ఎంకె) అనే సంస్థ నయనతారను దుయ్యబట్టడం ఏంటి? బరితెగించిందని గోల చెయ్యడం ఏంటి? ఇంతటితో సరిపోదన్నట్టు ఆమె పోస్టర్లు తగులబెట్టడం ఏమిటి? ఏమో... ఇదంతా సినిమాను ప్రమోట్ చేసుకోడానికి అయినా కావచ్చునేమో... అయితే ఈ రాద్దాంతం గురించి నయన్ నోరు విప్పిందట... ‘‘వీడియో క్లిప్పింగ్ నిజం కాదు... నేను చెన్నై వీధుల్లో వైన్ షాపుకు వెళ్ళి బీరు బాటిల్ కొనలేదు. ‘నానుమ్ రౌడీ ధాన్’ అనే సినిమాలోని సీన్ అది. ఇందులో సేతుపతి హీరో, దర్శకుడు విఘ్నేష్ శివన్. ఇది సినిమాలోని ఒక సీన్ మాత్రమే’’ అంటూ క్లారిటీ ఇచ్చింది. అదండీ సంగతి.... అంటే నిజంగానే సినిమా కోసం ఇచ్చుకునే పబ్లిసిటీగా అనిపిస్తోంది కదా... ఏదేమైనా తారల పర్సనల్ విషయాలపై జనాలు ఇంతలా స్పందించడం కూడా కరెక్టు కాదేమో అనిపిస్తోంది.