డర్టీ సినిమా తరువాత వైవిద్యమైన పాత్రలకే ప్రాధాన్యతనిస్తూ కొన్ని ప్రత్యేకమైన క్యారెక్టర్లకే పరిమితమవుతూ వస్తోంది విద్యాబాలన్. సినిమాలను ఎంపిక చేసుకోవడంలో ఆచీతూచీ ముందుకు వెళుతోంది. పెళ్ళి తరువాత ఈమెకు ఆఫర్లేమీ తగ్గలేదు. తమ సినిమాలో చేయమని ఎందరో డైరెక్టర్లు నిర్మాతలు ఈమెను అప్రోచ్ అవుతున్నప్పటికీ ఏ సినిమా పడితే ఆ సినిమాకు ఒప్పుకోకుండా ప్రత్యేకమైన తన స్థానాన్ని పదిలపరుచుకుంటూ బాలీవుడ్ లో టాప్ మోస్ట్ సెలెబ్రిటీగానే గుర్తింపు పొందుతోంది. అయితే ఈ మధ్య బయోపిక్ మూవీల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ఈమెకు రెండు బయోపిక్ సినిమాలకు ఆఫర్లు వచ్చాయి. ఒకటి దివంగత నటి సుచిత్రా సేన్ జీవిత కథ ఆధారంగా రూపొందే చిత్రం అయితే మరొకటి పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కథతో తీయబోతున్న చిత్రం. ఈ రెండింటిలో బెనజీర్ వైపుకే విద్య మొగ్గు చూపుతోంది. ఈ చిత్రం ద్వారా ఇంటర్నేషనల్ గుర్తింపు పొందాలనేది విద్యాబాలన్ ఆలోచన కాబోలు. ఇప్పటికే విద్యాబాలన్ కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చినప్పటికీ ఇంటర్నేషనల్ పొలిటీషియన్ బయోపిక్ లో నటించడం ద్వారా ఈమె కెరీర్ కు మరో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది.