సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ చేస్తున్న చిత్రం 'లయన్'. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన త్రిష, రాధికాఅప్టేలు నటిస్తున్నారు. బాలకృష్ణ 98వ చిత్రం తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సత్య దేవ దర్శకుడు. ఎస్.ఎల్.వి.సినిమా బ్యానర్‌పై రుద్రపాటి రమణారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత 'లక్ష్యం', 'లౌక్యం' చిత్రాల ఫేమ్ శ్రీవాస్ దర్శకత్వంలో బాలకృష్ణ తన 99వ చిత్రాన్ని చేయనున్నాడనే వార్తలు వినిపించాయి. ఈ చిత్రానికి డిక్టేటర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కాగా ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో ప్రారంభించనున్నారట. విజయదశమి కానుకగా సినిమాని అక్టోబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నట్లు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.