ఇది హిట్ పెయిర్ కాదు... రియల్ పెయిర్... ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమాల వార్తలకంటే వీరిద్దరి మధ్య నడుస్తున్న ప్రేమ ముచ్చట్లు వినాలంటేనే క్రేజ్ జనాలకు. వీరిద్దరూ కలిసి వోగ్ మేగజైన్ కు ఇచ్చిన ఫొటో షూట్ చూస్తే... వీరి కెమిస్ట్రీ గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఒకరికొకరుగా పేనవేసుకుపోయినట్టున్న ఈ స్టిల్ ఎంత హాట్ హాట్ గా ఉందో... రొమాంటిక్ పెయిర్ ఆఫ్ బాలీవుడ్ అని ముద్ర వేసొయ్యొచ్చు ఈ ఇద్దరిపైనా.
దీపిక అండ్ రణవీర్ కం టుగెదర్ ఫర్ అవర్ 8వ వార్షికోత్సవం .. అంటూ కవర్ పేజీపై వేయడం విశేషం.
వోగ్ మ్యాగజైన్ 8వ వార్షికోత్సవంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వీరిద్దరిపై ఇలా ఫొటో షూట్ చేసి ప్రత్యేకమైన కవర్ పేజీని డిజైన్ చేసింది ఈ పత్రిక. ఇందులో వీరిపై ప్రత్యేకించి కథనాలు ప్రచురించిందట. ఫొటోను మించి ఈ ఇద్దరి గురించి తెలియని విషయాలేమైనా ఈ మాగజైన్ లో ఉంటాయేమోనన్న క్యూరియాసిటీ పెరిగిపోతుంది కవర్ పేజీ చూస్తుంటే...