చిరంజీవిగారి 150 సినిమా ఏమో గానీ ఎట్టకేలకు బ్రూస్ లీ కోసం ఏడేళ్ళ తరువాత కెమెరా ముందుకు వచ్చేశారు. తనయునితో చేయబోయే ఈ పాత్ర గురించి సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. తండ్రీ తనయుల కలయిక మగధీరలో చూసిన అభిమానులు ఫుల్ ఖుళీ అయిపోయారు. అలాంటిదే ఓ చిన్న పాత్రను బ్రూస్ లీ లో కూడా చేయబోతున్నారు చిరంజీవి. ఇప్పుడు శ్రీను వైట్ల చిరంజీవిని ఏ గెటప్ లో చూపిస్తారో ననే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. ఇది సస్పెన్స్ లో పెడితే ఈ చిన్న సీన్ కోసమైనా జనాలు ఎగబడతారన్న స్ట్రాటజీని ఈ చిత్ర బృందం పాటిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో చిరు స్టిల్ ఒకటి బయటికి వచ్చింది. ఇదే బ్రూస్ లీ చిత్రంలోని చిరు గెటప్ అంటూ.... కాక పోతే ఈ స్టిల్ లో చిరు వెనుకనుంచి మాత్రమే కనిపిస్తున్నారు. ఇది షూటింగ్ స్పాట్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి బ్రూస్ లీ షూటింగ్ ముగించినట్టు శ్రీనువైట్ల ట్విట్టర్ లో తెలిపారు. అభిమానులు మాత్రం ఈ స్టిల్ పై రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు.