నటసింహ బాలయ్య 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే పక్కా స్క్రిప్ట్ రెడీ చేసుకున్న దర్శకుడు క్రిష్ మే మొదటి వారంలో సినిమాను ట్రాక్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అయ్యాడు. నటీనటుల ఎంపికను గోప్యంగా ఉంచిన క్రిష్, టెక్నిషియన్ విషయంలో మాత్రం బాగా శ్రద్ధ తీసుకుంటున్నాడు. సంగీత దర్శకుడిగా దేవీశ్రీప్రసాద్ ను ఇప్పటికే ఎంపిక చేశాడు కూడా. అంతేకాదు దేవీ కూడా సినిమా కోసం అమెరికా వెళ్లి అక్కడ సిట్టింగ్ వేసి అదే పనిలో ఉన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కూడా. అయితే ఇక్కడ ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. దేవీ సంగీత దర్శకత్వంలో గతంలో ఇలా హిస్టారికల్ చిత్రాలు హిట్ అయిన దాఖలాలు లేవు. డెబ్యూ సినిమా దేవీ తప్పిస్తే పౌర్ణమి, ఢమరుకం, పులి ఇలా అన్నీ ఫ్లాప్ జాబితాలోనే ఉన్నాయి. సినిమా ట్యూన్స్ పరంగా, బ్యాగ్రౌండ్ స్కోర్ పరంగా ఆకట్టుకునేలా ఉంటున్నప్పటికీ ఎందుకనో ఆయా చిత్రాలు ఆడలేదు. దీంతో అటువంటి జోనర్ చిత్రాలకు దేవీ డేంజర్ అని సన్నిహితులు సలహా ఇస్తున్నప్పటికీ అవేం పట్టకుండా క్రిష్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు సమాచారం.