బన్నీ చేసిన జిమ్మిక్కు ఏంటసలు?

April 26, 2016 | 04:01 PM | 4 Views
ప్రింట్ కామెంట్
sarrainodu-3days-box-office-collection-niharonline

ఓ పెద్ద సినిమా... ఫస్ట్ డే కే డివైడ్ టాక్ వచ్చేస్తే పరిస్థితి ఏంటి. రీసెంట్ గా వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ ను పరిశీలిస్తే ఈ విషయం అర్థమౌతుంది. భారీ బడ్జెట్ తో వచ్చిన ఆ సినిమాను పవర్ స్టార్ స్టామినా కూడా కాపాడలేక, బయ్యర్లకు భారీగానే నష్టాలను మిగిల్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన సరైనోడు చిత్రం పై కూడా క్రిటిక్స్ ఫస్ట్ డే పెదవి విరిచారు. దీంతో సర్దార్ సీన్ రిపీట్ అవుద్దని అంతా భావించారు.  ఓ వర్గం ప్రేక్షకులకు తప్ప, అందరినీ ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయిందని నెగటివ్ రివ్యూలతో సరిపెట్టేశారు. అయితే అవేం పట్టనట్లు మూడే రోజుల్లో 30.3 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఔరా అనిపించాడు బన్నీ. 

మూడు రోజుల మొత్తం గ్రాస్ వసూళ్లు రూ.46 కోట్ల దాకా ఉండటం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో రూ.21.8 కోట్ల షేర్.. రూ.31.45 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. రాయలసీమ (సీడెడ్)లో రూ.4.35 కోట్ల షేర్.. రూ.5.35 కోట్ల గ్రాస్ వసూలైంది. ఉత్తరాంధ్రలో రూ.2.4 కోట్ల షేర్ రావడం విశేషం. మొత్తంగా ఆంధ్రా ఏరియాలో రూ.10 కోట్ల దాకా షేర్.. రూ.15 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది సరైనోడు. ఇక ఓవర్సీస్ మొదటి నుంచే కలెక్షన్లు తక్కువగా ఉన్నాయి. అయితే కర్ణాటకలో సరైనోడు సాధించిన వసూళ్లు చూస్తే ఆశ్చర్యపోవటం ఖాయం. ఒక్క బెంగళూరులోనే ఈ సినిమా మూడు రోజుల్లో రూ.1.5 కోట్లు.. మిగతా ప్రాంతాల్లో రూ.3.25 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. చిత్రం 54 కోట్లకు అమ్ముడుపోగా,  ఇంకో పాతిక కోట్లు వస్తే సరైనోడు సేఫ్ జోన్ లోకి చేరిపోతాడు. సోమవారం కూడా షోలన్నీ దాదాపు హౌజ్ పుల్ పడటం చిత్ర యూనిట్ లో జోష్ నింపుతోంది. ఈ వారం రాజా చెయ్యివేస్తే చిత్రం తప్ప వేరే ఏం లేకపోవటం సరైనోడుకి కలిసొచ్చే అంశం. మొత్తానికి వరుసగా మూడు 50 కోట్ల చిత్రాలను అందించిన బన్నీ మరో హఫ్ సెంచరీని తన ఖాతాలో వేయటం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ