రఘువరన్ బిటెక్ సినిమా సక్సెస్ తో ధనుష్ చూపు తెలుగు ప్రేక్షకులపై పడింది. తెలుగు ఇండస్ట్రీపై తమిళనటులకు కూడా ఇప్పుడు ఆసక్తి పెరుగుతోంది. తమిళంలోని ప్రధాన హీరోలంతా టాలీవుడ్‌పై దృష్టి పెట్టినప్పటికీ విజయ్, ధనుష్‌లు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇక 'త్రీ' సినిమాతో ధనుష్, 'తుపాకీ'తో విజయ్‌లు తెలుగునాట తమకంటూ ఓ మార్కెట్ సృష్టించుకున్నారు. తాజాగా ధనుష్ డబ్బింగ్ చిత్రం 'రఘువరన్ బీటెక్' టాలీవుడ్లో రిలీజై ప్రేక్షకాధరణ పొందింది. దీంతో తన రాబోయే చిత్రాన్ని తమిళంతోపాటు తెలుగులోనూ ఒకేసారి విడుదల చేయడానికి ధనుష్ సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం తమిళంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న 'అనేగన్' చిత్రాన్ని తెలుగులో 'అనేకుడు' పేరుతో రిలీజ్ చేయనున్నారు. ప్రేమికుల రోజు దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషాల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. అంతకు ముందు రజనీ అల్లుడుగా ఎరిగిన తెలుగు ప్రేక్షకులకు ‘కొలవరి’ పాటతో వారి కళ్ళలో పడి, ధనుష్ సినిమాలు చూడ్డం మొదలు పెట్టారు. త్రీ, రఘువరన్ బిటెక్ లతో ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు ధనుష్.