సినిమాల్లో అగ్ర నటులు తీసుకునే రెమ్యునరేషన్ విని, అమ్మో... ఇంత మొత్తమా... అనుకుంటుంటారు సామాన్య ప్రజలు. తన పేరుతో, తన జీవిత కథపై సినిమా తీస్తున్నందుకు మాత్రమే థోనీ 20 కోట్లు తీసుకుంటున్నాడట. బంపరాఫర్ కదా... ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చి, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా ధోని ఎదిగిన తీరు.. అతని జీవిత కథతో బాలీవుడ్ లో ఎం.ఎస్.ధోని అనే సినిమా తయారవుతున్న సంగతి తెలిసిందే. ఎ వెడ్నస్ డే, స్పెషల్ చబ్బీస్ లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న నీరజ్ పాండే ధోని జీవిత కథను తెరకెక్కిస్తున్నాడు. ఇంకా ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తవ్వలేదు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ ఈ సినిమాను 80 కోట్లకు కొన్నట్లు సమాచారం. కాగా ధోని తన కథతో సినిమా తీస్తున్నందుకు 20 కోట్లు తీసుకోవడమే కాదు, సినిమా లాభాల్లో కూడా వాటా ఉందట. ఈ సినిమా కోసం ధోని కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో కొన్ని నెలల పాటు మాట్లాడి స్క్రిప్టు తయారు చేశాడట నీరజ్ పాండే. శుద్ధ్ దేశీ రొమాన్స్ తో హీరోగా మంచి పేరు సంపాదించిన సుశాంత్ రాజ్పుత్ ఈ సినిమాలో ధోని పాత్రను పోషిస్తున్నాడు. ఆ మధ్య విడుదలైన ఫస్ట్లుక్ జనాల్లో ఆసక్తి రేపింది. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్, సురేశ్ రైనా పాత్ర పోషిస్తునానడన్న వార్తలొస్తున్నాయి కానీ ఈ విషయం ఇంకా కన్ఫం చేయలేదు.