దీపిక పడుకొనే ‘హాపీ న్యూ ఇయర్’ సినిమా చేస్తున్నప్పుడు చాలా డిప్రెషన్ కు గురయ్యాననీ, డిప్రెషన్ లో ఉన్నప్పటి తన ఫీలింగ్స్, నిద్రలేవడంలో ఉండే ఇబ్బందులను ట్విట్టర్ లో అప్పట్లో ట్వీట్ చేసింది. డిప్రెషన్‌తో తాను యుద్ధం చేశానని దీపికా పడుకొనే చేసిన కామెంట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలపై బిగ్ బీ అమితాబ్ స్పందిస్తూ.. ఆమె మాటల్లో నిజాయితీ ఉందని చెప్పుకొచ్చాడు. ఎంతో ధైర్యం ఉంటేగానీ ఇలా మాట్లాడలేరని ఓ కితాబు కూడా ఇచ్చేశాడు. యాంగ్జైటీ, డిప్రెషన్‌పై అవేర్నెస్ ప్రోగ్రామ్‌లో దీపిక ఈ వ్యాఖ్యలు చేసింది. డిప్రెషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్‌లో దీపిక పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని బిగ్ బీ అన్నారు. తాను హైపటైటిస్, డయాబెటిస్, టీబీ వంటి వ్యాధులకు పని చేశాననీ, వీటిపై అవగాహన కల్పించడంపై చాలా ప్రయత్నించినట్టు చెప్పుకొచ్చాడు. కానీ దీపిక ఈ విధంగా బయటికి చెప్పుకోవడం వల్ల డిప్రెషన్ గురించి అవగాహ కల్పించి, దాన్ని నుంచి బయట పడడానికి ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని మెచ్చుకున్నారు.