అంతర్గత స్వేచ్ఛలోంచి ‘ఉపేంద్ర 2’

August 13, 2015 | 03:14 PM | 2 Views
ప్రింట్ కామెంట్
upendra_about_upendra_2_niharonline

'ఉపేంద్ర' లో నేను గురించి చెపితే... ‘ఉపేంద్ర 2’లో నువ్వు గురించి చెబుతున్నా.... నా ఆలోచనలే ఇలా ఉంటాయని చెబుతున్నాడు కన్నడ హీరో కం డైరెక్టర్ ఉపేంద్ర. ఈ నెల 15న తన సినిమా విడుదల సందర్భంగా మాట్లాడుతూ... ‘‘నేను అనే భావన వదిలేసి 'నువ్వు' అని ఆ క్యారెక్టర్ ఆలోచించడం మొదలు పెడితే... ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచే ఈ సినిమా పుట్టింది. పదేళ్ల నుంచి ఇదే ఆలోచన.... అంతర్గత స్వేచ్ఛ నేపథ్యంలోని సినిమా ఇది. ఉపేంద్ర అప్పుడు అందరికీ అర్థమయ్యింది కాబట్టి, ఇప్పుడు ఉపేంద్ర 2 కూడా అర్థమవుతుంది. నువ్వు అంటే మనందరం అని అర్థం. ప్రతి ఒక్కరికీ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ నే తెరపై చూపించాను. మొదటి ఉపేంద్రలా హార్ష్ గా ఉండదు. ఆడవాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలిగించని సినిమా ఇది. థియేటర్ వరకూ వస్తే నచ్చుతుంది. ఉపేంద్ర చూడని వాళ్లకు కూడా నచ్చుతుంది. ఫ్రీడమ్ పై తీసిన సినిమా. లక్కీగా స్వాతంత్య్ర దినోత్సవం నాడే రిలీజవుతోంది. నేను తీసిన ‘రా’ చిత్రాన్ని బుజ్జి నిర్మించారు. ఉపేంద్ర సినిమా అంటే చాలా ఇష్టమని ఉపేంద్ర 2ని తెలుగులో నేనే రిలీజ్ చేస్తానని బుజ్జి చెప్పాడు. కథ కూడా తెలుసుకోలేదు. అతడి వల్ల పెద్ద రేంజ్ వచ్చింది.ఎక్కువ కష్టపడిన విషయాలు ఎక్కువ సంతృప్తినిస్తాయి. అందుకే దర్శకత్వం కష్టం అయినా ఇష్టం. నటన చాలా సింపుల్.ఎక్స్ పెక్టేషన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని సామెత ఉంది. మనిషికి ఎంత సాధించినా సంతృప్తి అనేదే ఉండదు. అసంతృప్తి తప్ప. ఒకప్పుడు టీ కప్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుని తాగేవాడిని. అది ఆనందంగా ఉన్నా నచ్చేది కాదు. అందుకే సంపాదించాను. అయినా సంతృప్తి లేదు. అందుకే ఇటీవల కాస్త ఆగాను. మున్ముందు నిర్మాతలు ముందుకొస్తే నేను తెలుగులో సినిమాలు తీయడానికి సిద్ధమే. ఆత్మాన్వేషణ ఓకే. నాకూ భార్యా పిల్లలు ఉన్నారు. కాబట్టి వాళ్లను వదిలి సన్యాసిగా మారను. నాపై జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాల ప్రభావం ఉంటుంది’’ అన్నారు వెరైటీ ఆలోచన ఉపేంద్ర. ఆయన ఆలోచనలు విభిన్నంగా ఉన్నా... ఆయన కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తి మాత్రమే. కానీ ఆయన సినిమా పోస్టర్లు చూస్తే ఓ ఫామిలీ చిత్రంలా అనిపించదు. అదే ఉపేంద్ర స్పెషాలిటీ.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ