శ్రీమంతుడు ఈరోస్ చేతిలో పడ్డాడు

August 06, 2015 | 04:45 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Sriamthudu_eros_international(5)

ఇంతకు ముందు 1 నేనొక్కడినే, లింగా వంటి చిత్రాలను వరల్డ్ వైడ్ హక్కులను తీసుకున్న ప్రఖ్యాత ఈరోస్ సంస్థ 'శ్రీమంతుడు' వరల్డ్ వైడ్ హక్కులను తీసేసుకుంది.  అంతకు ముందు వరకూ ఈ సంస్థ నటులకు ఉన్న క్రేజ్ ను బట్టే హక్కులను సొంతం చేసుకుంది. ఈ లెక్కన లింగ, 1 నేనొక్కడినే బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. కానీ ఈ సినిమాను ఈసారి వారికి చూపించిన తరువాతే ఈ రేటుకు ఇచ్చినట్టు తెలుస్తోంది. సినిమాకు వచ్చిన క్రేజ్, హైప్, ఇతరత్రా వ్యవహారాలను దృష్టిలో వుంచుకుని 80 కోట్లకు అటు ఇటుగా ఈ సినిమా హక్కులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి దాకా జరిగిన అమ్మకాలు, ఇతరత్రా వ్యవహారాలు అన్నీ ఇక ఈరోస్ కే చెందుతాయి. ఈ డీల్ లో ఇటు మహేష్ కు, అటు మైత్రీ మూవీస్ కు మంచి లాభాలు వచ్చాయంటున్నారు. ఈరోస్ గతంలొ కూడా మహేష్ సినిమాలు కొనుగోలు చేసింది. వాటి లావాదేవీలను, మిగులు తగుళ్లను కూడా ఇటీవలే సెట్ చేసుకున్నారు. శ్రీమంతుడు సినిమా మంచి వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు నమ్మకంగా వున్నాయి. మహేష్ పై సినిమా ప్రేక్షకుల్లో క్రేజ్ వుండడం, కొరటాల శివ డైరక్షన్ పై నమ్మకం, ప్రస్తుతం థియేటర్లలలో సరైన సినిమా లేకపోవడం వంటి కారణాలున్నాయి. వీటన్నింటి రీత్యా ఈరోస్ సంస్థ భారీ మొత్తం చెల్లించి హక్కులు తీసుకుందని తెలుస్తోంది.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ