ఇండస్ట్రీలోకి ఎంట్రీ కాస్త ఆలస్యంగా ఇచ్చినా శృతి అప్పుడే ప్రొడక్షన్ హౌజ్ మొదలు పెట్టేసింది. అయినా బాలీవుడ్ వుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అన్నిట్లోనూ ఇప్పుడు బాగానే సంపాదించేస్తుంది కదా... డబ్బు బాగానే జమ చేసుకున్నట్టుంది మరి సైడ్ బిజినెస్ ఏదో ఒకటి ఉండాలి కదా సినిమా వాళ్ళకు... ఎల్లకాలం ఇండస్ట్రీ అందరి నటులనూ పోషించలేదు మరి... అయినా ఆడాళ్ళంతా జువెలరీ, బట్టల షాపులు, హోటళ్ళు అంటుంటే శృతి ప్రొడక్షన్ హౌజ్ తో చేతులు కాల్చుకోవాలని ఏంటో కోరిక. ఈ మధ్యే ఛార్మి జ్యోతిలక్ష్మి సినిమాతో నిర్మాతయ్యింది. తమిళంలో అమలా పాల్ నిర్మాతగా మారిపోతే, ఇక షార్టు ఫిలింస్ తీస్తానంటూ శృతి హాసన్ కూడా తయారైంది. అమ్మడు ''ఇసిడ్రో'' అనే ప్రొడక్షన్ కంపెనీ లాంఛ్ చేసి.. ఆ బ్యానర్‌పై సినిమాలు తీస్తుందట. మరి ఎంత సక్సెస్ అవుతుందో చూడాలి.