హాలీవుడ్ నటి ఎమిలియా క్లార్క్. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్ సినిమాలో, ముఖ్యంగా శృంగార సన్నివేశాల్లో అలవోకగా నటించి అందరినీ ఆకట్టుకుంది ఈ 29 ఏళ్ల నటి. బోల్డ్ సీన్లకు పెట్టింది పెరైన ఎమిలియా ఆ సన్నివేశాల్లో నటించడమే కాదు, ఎస్క్వైర్ మ్యాగజీన్ కవర్‌పేజీ పూర్తి నగ్నంగా ఇప్పుడు దర్శనమిచ్చి వార్తల్లోకి ఎక్కింది. అయితే అందరి సమక్షంలో కెమెరా ముందు ఒంటి మీద నూలుపోగు లేకుండా కనిపించడం మాములు విషయం కాదు. కానీ, ఆ సమయంలో ఏం చేసింది? అనే విషయాలను తాజాగా ఎమిలియా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
బెడ్ సీన్లలో నటించాల్సి వచ్చినప్పుడకు తనకు తరచూ వొడ్కా ఇచ్చే వారంట. సీన్ ముగిసిన వెంటనే బెడ్‌షీట్ కప్పుకునేదంట. అలా మద్యం సహకారంతో ఆ సన్నివేశాల చిత్రీకరణ ముగిసింది' అని ఆమె వివరించింది. అసలు నగ్నంగా నటించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని చెబుతున్న ఎమిలీయా రాబోయే 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' చిత్రాల్లో ఇలాంటి సన్నివేశాల్లో పురుషులతో కలిసి నటించేందుకు సిద్ధమేనని, ఆ సన్నివేశాలు ఫర్ ఫెక్ట్ గా వచ్చేందుకు కూడా కృషి చేస్తానని చెబుతోంది.