అజారుద్దీన్ బయోపిక్ లో ఇమ్రాన్ హష్మీ

December 01, 2014 | 02:35 PM | 38 Views
ప్రింట్ కామెంట్

గత కొనేళ్లుగా సరైన హిట్ లేని బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీని ఇప్పుడో అద్భుత అవకాశం వరించింది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ లైఫ్ ఆధారంగా తీయబోయే చిత్రంలో హష్మీ హీరోగా ఎంపికయ్యాడు. ఇక ఈ చిత్ర విశేషాల గురించి ఇమ్రాన్ మాట్లాడుతూ... క్రికెట్ నేపథ్యంగా ఈ చిత్ర కథ తెరకెక్కుతున్నప్పటికీ అజారుద్దీన్ జీవిత ఇతివ్రుత్తామే ఇందులో ప్రధాన అంశంగా ఉండబోతుంది అని చెప్పాడు. అజార్ లాంటి గొప్ప క్రీడాకారుడి జీవిత చరిత్రను మూడు గంటల్లో చూపించడం కష్టంతో కూడుకున్న పనే అయిన ఆయన గౌరవానికి ఏ మాత్రం భంగం కలిగించకుండా పాత్ర కోసం కష్టపడుతానని చెప్పుకొచ్చాడు. గత రెండు మూడేళ్లుగా సరైన హిట్ లేని ఈ స్టార్ కి ఇదో అనుకోని ఆఫర్ అనుకోవాల్సిందే. తాజాగా రిలీజైన ఉంగ్లి చిత్రం కూడా పెద్ద డిజాస్టర్ గానే మిగిలింది. బాలీవుడ్ లో హిట్ ఫ్లాప్ లను సమానంగా చూడాలని హష్మీ తనకు సంబంధంలేని సైద్ధాంతిక ధోరణిలో చెబుతున్నప్పటికీ ఓ మాంచి హిట్ కోసం ఆరాటం పడటం సహజమనే సర్దుకుపోవాలి. మరి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న చిత్రాలన్నీ హిట్లు కొడుతున్నాయి కదా ఇలా అయిన ఇమ్రాన్ కు ఓ భారీ హిట్ పడాలని ఆశిద్దాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ