సమంత ప్రశ్నలు... మహేష్ పంచ్ లు

December 01, 2014 | 02:25 PM | 34 Views
ప్రింట్ కామెంట్

‘వీరిద్దరి మధ్య ఏదో గొడవుంది’ అన్న రూమర్ నిజం కాదని చెప్పాలకున్నట్టున్న ఈ ఇంటర్వ్యూ హుధూధ్ బాధితులకోసం తలపెట్టిన మేము సైతంలోనిది. మహేష్ బాబు, త్రివిక్రమ్ లను ఇంటర్వ్యూ చేస్తున్న సమంత స్కిట్ నవ్వులు, సెటైర్ ల మధ్య కాస్త ఆసక్తిగానే నడిచింది. ఇందులో సమంత వేసిన చాలా ప్రశ్నలకు మహేష్ బాబు సెటైర్ సమాధానాలు నొప్పించక తానొవ్వక అన్నట్టు ఉన్నా... లోగుట్టు పెరుమాళ్ళకెరుక అనుకుంటున్న ఆడియన్సూ ఉన్నారు. వన్ సినిమా టైంలో సమంతకు, మహేష్ బాబు అభిమానులకు ట్విట్టర్ లో మాటల యుద్ధం జరిగింది. మహేష్ అభిమానులను సపోర్ట్ కూడా చేసినట్టు వార్తలు షికారు చేశాయి. ఈ విషయం తర్వాత సమంతతో మహేష్ బాబు సినిమా చేయడని ఓ టాక్ కూడా వచ్చింది. మొదటి ప్రశ్నతోనే మహేష్ ను పైకెత్తాలని చూస్తూ మీరు సూపర్ స్టార్ కదా... అనగానే నన్ను రజనీకాంత్ తో పోలుస్తుందేంటి? అంటూ త్రివిక్రమ్ వైపు తిరిగాడు మహేష్. మన్నించెయ్యండి... అని ఏదో అనబోతుంటే, ఇప్పుడు అవెందుకు? అన్నాడు మహేష్. అయితే మన ముగ్గురితో మళ్లీ సినిమా ఎప్పుడు అన్న సమంత ప్రశ్నకు మా ఇద్దరితో ఉంటుంది కానీ అందులో నువ్వుండవు అని సెటైర్ వేశారు. మీ కో ఆర్టిస్టుల్లో మీకు నచ్చిన వారెవరు అని అడగ్గా నాతో నటించిన నా వైఫే నాకు నచ్చిన కో ఆర్టిస్టు అనేశాడు. (పాపం సమంత తన పేరు చెపుతాడనుకుని ఉంటుంది). ‘మీ సినిమాలు హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయ’ని సమంతా పొగడగా... ‘ఇలాంటి మాటలు వినే హీరోలు షెడ్డుకు వెళ్ళిపోతున్నారు’ అని మహేష్‌బాబు కౌంటర్ ఇచ్చాడు. రిమేక్ సినిమాలపై ప్రశ్నిస్తుండగా ’తను రీమేక్ చిత్రాలు చేయనని సూటిగా సమాధానమిచ్చాడు మహేష్. మొత్తానికి సమంత వ్యవహారంలో మన సూపర్ స్టార్ తగ్గేలా లేడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ