సామాజిక అంశాల నేపథ్యంలో ఎప్పుడు చిత్రాలు వచ్చిన ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా కోలీవుడ్లో ఇలాంటి జోనర్ చిత్రాలు కాసుల పంటను కురిపిస్తాయి. రియాలిటికీ దగ్గరగా ఉండేలా స్కాంలపై అక్కడ చిత్రాలు తెరకెక్కిస్తారు దర్శకులు. తాజాగా అలాంటి నేపథ్యంలో వచ్చిన చిత్రం కనిథన్. సీనియర్ నటుడు మురళి తనయుడు అధర్వ హీరోగా, కేథరిన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. జర్నలిస్ట్ అయిన హీరో.. ఫేక్ డిగ్రీ స్కాండల్ లో అరెస్ట్ అవుతాడు. అనుకోకుండా ఇరుక్కున్న హీరో.. దీనికి వెనక ఎవరెవరున్నారనే విషయాన్ని కూలిలాగి… రెడ్ హ్యాండెడ్ గా పట్టించడమే ఈ చిత్ర కథ. హీరో మైండ్ గేమ్ ప్రధానంగా స్ర్కీన్ ప్లే సాగుతుంది.
దీంతో ఈ చిత్రాన్ని కాస్త మార్పులు, చేర్పులు చేసి తెలుగులో రీమేక్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ముందుగా బన్నీతో ఈ చిత్రాన్ని తీయాలనుకున్నప్పటికీ కుదరకపోవటంతో ఇప్పుడు మాస్ రాజా రవితేజతో తీయాలనుకుంటున్నారంట. అంతేకాదు అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయనేది తాజా సమాచారం. మాతృకకు దర్శకత్వం వహించిన టి.ఎన్.సంతోష్ తెలుగులోనూ ఈ చిత్రానికి డైరక్షన్ చేస్తాడు. కలైపులి థాను నిర్మాతగా వ్యవహరించనున్న ఈ చిత్రానికి సంబంధిన పూర్తివివరాలు మరికొద్దిరోజులోనే తెలియనున్నాయి. ప్రస్తుతం రవితేజ 'రాబిన్ హుడ్' సినిమాతో బిజీగా ఉన్నాడు.