షాక్: బాలీవుడ్ టాప్ నటుడిపై పోలీస్ కేసు!

September 22, 2015 | 02:38 PM | 5 Views
ప్రింట్ కామెంట్
case-file-against-ranbir-kapoor-faran-akhtar-niharonline

ఆన్ లైన్లో షాపింగ్ చెయ్యటం ఆనక చేతులు కాలాక తిరిగ్గా ఆకులు పట్టుకోవటం ఇప్పుడు పరిపాటి అయ్యింది. అయితే కంపెనీ తరపు నుంచి జరిగే మోసాలకు వాటిని ప్రమోట్ చేసే వారిని బాధ్యులను చెయ్యటం ఎంత వరకు కరెక్ట్. మొన్నామధ్య మ్యాగీ పై నిషేధం సందర్భంగా వాటికి ప్రచారకర్తలుగా పనిచేసిన బిగ్ బీ అమితాబ్, మాధురి దీక్షిత్ లకు నోటీసులు జారీ చేసిన సంగతి మరువక ముందే ఇప్పుడు మరో హీరోకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.  ఓ అడ్వర్టైజింగ్ కంపెనీ కి బావినియోగదారులను మోసం చేసేలా ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు దర్శకుడు, నటుడు ఫరాన్ అక్తర్ పై కూడా కేసు నమోదైంది.

కేశవ్ నగర్ కు చెందిన రాజత్ బన్సాల్ అనే న్యాయవాది ఈ మేరకు మదియాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆన్ లైన్ షాపింగ్ సైట్ కు రణబీర్, ఫరాన్ అక్తర్ లిద్దరూ ప్రకటన లిచ్చారని, వాటిని చూసి తాను మోసపోయానని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 40 అంగుళాల ఎల్ఈడీ టీవీ కోసం ఆగస్టు 23న 'ఆస్క్ మి బజార్'లో ఆన్ లైన్ షాపింగ్ చేశానని, తన డెబిట్ కార్డు ద్వారా రూ. 29,999 కూడా చెల్లించానని, ముందుగా ప్రకటించిన తేదీల్లో తాను ఆర్డరు చేసింది రాకపోగా, బిల్లు మాత్రం పంపారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రణబీర్, అక్తర్ ల కారణంగానే తాను ఆ సైట్ కు ఆకర్షితుడనయ్యానని ఆ న్యాయవాది పేర్కొన్నట్లు పోలీసులు చెప్పారు. ఆస్క్ మి బజార్ ఆన్ లైన్ షాపింగ్ సైట్ డైరైక్టర్లపై కేసులు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

తాము కేవలం నిమిత్త మాత్రులమేనని వారంతా నెత్తి నోరు కొట్టుకుంటున్నా ఫిర్యాదు దారులు మాత్రం వారిదే బాధ్యత అంటూ కేసుల మీద కేసులు పెట్టుకుంటూ పోతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ