మరో బాలీవుడ్ బంధం బద్ధలైంది

January 22, 2016 | 12:28 PM | 5 Views
ప్రింట్ కామెంట్
Farhan Akhtar and Adhuna ready for divorce niharonline

పెళ్లి అనేది జీవితంలో ఎంత ముఖ్యమైన బంధమో సినిమా ఇండస్ట్రీలో మాత్రం అంత లైట్. హాలీవుడ్ నుంచి అరువు తెచ్చకున్న ఈ సంప్రదాయానికి సైతం భారతీయ సినీ ఫీల్డ్ కూడా అనుసరిస్తూ వస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ప్రేమలకే కాదు,  పెళ్లిలను టేక్ ఇట్ ఈజ్ గా తీసేసుకుని బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. కండల వీరుడు హృతిక్ భార్యతో ఎంత తేలికగా విడాకులు తీసుకున్నాడో తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సినీ జంట వివాహ బంధానికి గుడ్ బై చెప్పింది.

ప్రముఖ నటుడు, దర్శకుడు, గాయకుడు ఫర్హాన్ అక్తర్, ఆయన భార్య అధునా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ విషయంలో ఇద్దరం పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే, పిల్లల పెంపకం విషయంలో మాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని అక్తర్, అధునా ప్రకటించారు. హుందాగా విడిపోవాలని నిర్ణయించుకున్నామని, దయచేసిన తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో కోరారు.

ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అయిన అధునా బబానీకి అక్తర్ తో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారడంతో 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత అక్తర్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'దిల్ చాహ్ తా హై'కు ఆమె హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేశారు. దాంతో ఆమెకు ఎంతో పేరు లభించింది. గతకొంత కాలం నుంచి ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో విభేదాలు వచ్చాయని, అవి విడాకులకు దారి తీసాయని సమాచారం. అయితే ఒక హీరోయిన్ కారణంగా ఈ బ్రేకప్ జరిగిందనేది మరి కొందరి వాదన.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ