అదేంటీ న...మి...త ఎక్స్ పోజింగ్ చేయనంటుందని ఆశ్చర్యపోతున్నారా? ఆ కంగారును కాస్త కంట్రోల్ చేసుకోండి. ఇప్పుడొచ్చే పరబాష హీరోయిన్లు అందాల ప్రదర్శనకు ఏ మాత్రం వెనకాడటం లేదు. ఆడియో పంక్షన్ల దగ్గరి నుంచి సక్సెస్ మీట్ ల దాకా అన్ని పంక్షన్లలో, అవసరమైతే బయటి ఈవెంట్లలో కూడా ఎక్స్ పోజింగ్ చేస్తూ ఎగబడిబోతున్నారు. నాభి ప్రదర్శన, క్లీవేజ్ షోలు, అంతకు మించిన ఫీట్లు కూడా చేసిన హీరోయిన్లు బాలీవుడ్ కే కాదు, మన తెలుగులోనూ ఉన్నారు. ఆపై చిన్నాచితకా అవకాశాలను అందిపుచ్చుకుంటూ పైకి ఎగబాకిపోతున్నారు. గ్రాఫ్ పడిపోయిన హీరోయిన్ల విషయంలో ఇది ఈ మధ్య మరీ ఎక్కువైపోతుంది. పద్ధతిగా ఉండే హీరోయిన్లు అని పేరొందిన వారు కూడా ఏదో ఒక టైంలో ఖచ్ఛితంగా ఆ పని చేయాల్సిన అవసరం వచ్చేస్తుంది. ఇక అసలు విషయానికొస్తే పైన చెప్పుకున్న నమిత మీరనుకుంటున్న నమిత కాదు సుమండీ.
ప్రస్తుతం మాలీవుడ్, కోలీవుడ్ లో బిజీ స్టార్ గా ఉండి త్వరలో తెలుగు తెరకు పరిచయం కానున్న మరో మల్లు భామ నమితా ప్రమోద్. ఆది చుట్లలబ్బాయి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీ ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యిందట. గ్లామర్ గా కనిపించటానికి సిద్ధమే కానీ, అంగ ప్రదర్శనకు మాత్రం నో అని ఖరాఖండిగా చెప్పేస్తుంది. తెలుగు సినిమాల్లో ఎక్స్ పోజింగ్ ఎక్కువైపోతున్న టైంలో నమితా మాత్రం అవకాశాల కోసం అంతకు దిగజారనని చెప్పటం ఆశ్చర్యం కలిగించేదే. అన్నట్లు ఆది సినిమా సెట్లో ఉండగానే నారారోహిత్ సినిమా కూడా నమిత ఎంపికైనట్లు సమాచారం. మరి బోల్డ్ కు నో అన్న ఈ బ్యూటీ జర్నీ ఎలా సాగుతుందో లెట్ సీ...