రాజకీయాలపై ఆసక్తి లేదన్న సూపర్ స్టార్

October 28, 2015 | 10:49 AM | 2 Views
ప్రింట్ కామెంట్
george-clooney-not-intrested-in-politics-niharonline

రాజకీయాలు ఓ బురద. ఓ చెత్త అంటూ కామెంట్లు చేసే సెలబ్రిటీలను చాలా మందినే చూసి ఉంటాం. అశేష ప్రజాదరణ ఉన్న సినీ నటులు రాను రాను అంటూనే రాజకీయాల్లోకి వచ్చి భంగపడ్డవారు ఎందరో ఉన్నారు. అయితే స్టార్ డమ్ ఉండి, సామాజిక సేవ ద్వారా ప్రజల మన్ననలు అందుకున్న వారు పొలిటిక్స్ లోకి రాకపోవటం కాస్త ఆశ్చర్యకరంగానే ఉంటుంది. అలాంటి వారు అభిమానుల చేత బతిమాలించుకోవటం కూడా కామన్ గానే ఉంటుంది కూడా. ఇక ఇప్పుడు మరో సూపర్ స్టార్ కూడా ఇదే బాటలో నడుస్తున్నాడు.

రాజకీయాల్లోకి రావడమంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదని ప్రముఖ హాలీవుడ్ నటుడు జార్జ్ క్లూనీ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ, అమెరికా రాజకీయాలపై ఆసక్తి చూపే జార్జ్ క్లూనీని చాలా మంది రాజకీయాల్లోకి రావాలని కోరుతుంటారు. తాజాగా ఆయనను పలువురు అభిమానులు రాజకీయాల్లోకి రావాలని కోరారు. 'రాజకీయాలకు ఓపిక, శ్రద్ధ చాలా అవసరం. నాకు అంత ఓపిక, శ్రద్ధ ఉన్నాయని భావించడం లేదు' అంటూ సమాధానం చెప్పాడు.

సోషల్ మీడియా ద్వారా రాజకీయాలపై పలు వ్యాఖ్యలు చేసే జార్జ్ క్లూనీ 2008, 2012లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరాక్ ఒబామకు మద్దతు పలికాడు. సూడాన్ లో రాజకీయ కల్లోలం రేగకుండా ఎప్పుడో చెక్ పెట్టాల్సిందని ఒబామాకు నేరుగా సూచించాడు క్లూనీ. అమెరికాలో ఒబామా కంటే మెరుగైన రాజనీతిజ్ఞుడు ప్రస్తుతానికి ఉన్నాడని తాను భావించడం లేదని ఆయన స్పష్టం చేశాడు. కాగా, ఆయన భార్య అమాల్ అలావుద్దీన్ మానవ హక్కుల ఉద్యమకారిణి కావడం విశేషం. జార్జ్ క్లూనీ నటించిన రెండు సినిమాలు ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ