రుద్రమదేవి ఇక తెరమీదకు వస్తుందంటే అందరిలోనూ ఈ ఎపిక్ మూవీపై మళ్ళీ ఆసక్తి పెరిగిపోయింది. ముఖ్యంగా బన్నీ ఆ బ్లకా డ్రెస్ లో యోధుడిలా కనిపిస్తుంటే ఆయన పాత్రమీద చాలా ఆసక్తి కనిపిస్తోంది. ఏకంగా 70 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ తీసుకురావడం కోసం గోన గన్నారెడ్డి పాత్రకు తన ఫేవరెట్ హీరో మహేష్ బాబును అడిగాడట గుణ శేఖర్. కానీ.. అతనొప్పుకోలేదు. అల్లు అర్జున్ ఈ పాత్ర చేయడాని కి ఓకే అనడంతో ఊపిరి పీల్చుకున్నాడు గుణ. బన్నీ రాకతో ఆటోమేటిగ్గా 'రుద్రమదేవి'కి స్టార్ వాల్యూ యాడ్ అయిపోయింది. ఐతే బన్నీని ఊరికే అలా రెండు మూడు సన్నివేశాల్లో చూపించి ముగించేస్తే ప్రేక్షకులు నిరాశ చెందుతారని భావించి అతడి పాత్ర నిడివి బాగా పెంచినట్లు సమాచారం. ముందు అనుకున్న ప్రకారమైతే ఈ పాత్ర 20 నిమిషాలకు మించి కనిపించదట. కానీ బన్నీ పాత్ర ఎంత పెరిగితే సినిమాకు అంత వెయిట్ పెరుగుతుందన్న ఉద్దేశంతో నిడివి పెంచి గంట పాటు గోన గన్నారెడ్డి పాత్ర కనిపించేలా చేశాడట గుణ శేఖర్. అయితే అందరూ కనుకున్నట్టు బన్నీ అతిథిగా వచ్చి వెళ్ళిపోవడం లేదు. ఇదే విషయం గుణశేఖర్ మాట్లాడుతూ ''మహా యజ్నం లాంటి ఈ సినిమా లో తాను కూడా భాగమవుతానని గోన గన్నారెడ్డి పాత్ర లో నటించేందుకు ముందుకొచ్చాడు అల్లు అర్జున్. ఆయన పాత్ర రాబిన్ హుడ్ తరహాలో ఉంటుంది. ఆయన షూటింగ్ లో పాల్గొన్నది 30 రోజులే అయినా. సినిమా కోసం నెల రోజుల పాటు ప్రత్యేకంగా సన్నద్ధమయ్యాడు. సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర గంట సేపు కనిపిస్తుంది'' అని వెల్లడించాడు గుణశేఖర్. బన్నీకి మలయాళం లో ఉన్న ఫాలోయింగ్ ని దృష్టి లో ఉంచుకుని ఈ సినిమాను కేరళలో కూడా విడుదల చేయబోతున్నాడు గుణశేఖర్ తెలిపాడు.