శ్రీనువైట్ల-రామ్ చరణ్ కాంబో సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 15కు విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు 50శాతం పూర్తి అయినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఇందులో నిజమెంతో తెలియదుగానీ, ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ఊహించని రేటుకి వెళ్లినట్టు వెబ్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నారు. దాదాపు 13 కోట్ల రూపాయాలకు జీ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ కొనుగోలు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో రామ్ చరణ్ కు చెల్లెలుగా కృతి కర్బందా నటిస్తుండగా, హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. తెలుగులో శాలిలైట్ రైట్స్ ఇప్పటి వరకూ ఈ రేంజ్ రేట్ ఏ సినిమా పలకలేదు. సినిమా ఇంకా పూర్తి కాకముందే ఇంత రేటు పలకడంపై సినీ వర్గాల్లో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.