ఎట్టకేలకు గోపాల గోపాల చిత్ర ఆడియో వేడుక తేదీ ఖరారైంది. మొదట్లో ఈ వేడుక ఉండదంటూ వార్తలోచ్చాయి. అయితే, ప్రమోషన్లో భాగంగా ఆడియో వేడుక చేయాలని నిర్మాతలు భావించారట. అంతేకాదు అందుకోసం పవన్ కళ్యాణ్ ను కూడా ఒప్పించినట్లు సమాచారం. జనవరి 3న ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో కేవలం మూడు పాటలే ఉండబోతున్నాయని తెలుస్తోంది. కాగా, సంక్రాంతికి కాస్త ముందుగానే చిత్రాన్ని రిలీజ్ చేయడానికి నిర్మాతలు సురేష్ బాబు, శరత్ మరార్ సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా ఈ నెల 30వ తేదీన ఆడియోను విడుదల చేద్దామనుకున్నారు. అయితే అదే రోజు ఐ తెలుగు వర్షన్ మనోహరుడు చిత్ర ఆడియో పంక్షన్ ఉండటంతో 3వ తేదీకి మార్చినట్లు సమాచారం.