మామూలు సినిమాల సెట్టింగ్స్ వేరు... చారిత్రక సినిమాల సెట్టింగ్స్ వేరు. ఇలాంటి సినిమాలకు భారీ బడ్జెట్ తో సెట్టింగ్స్ వేయించడంలో దిట్ట గుణశేఖర్. ఎంతో ప్లానింగ్ తో ఈ సినిమా తీసినప్పటికీ, భారీ బడ్జెట్ మూవీ కావడంతో ఈ సినిమాకు అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అందులో గుణ శేఖర్ ఈ సినిమాకు దర్శకుడు, నిర్మాత కూడా. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన రుద్రమదేవి సినిమాకు మళ్ళీ అవాంతరం రానున్నట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. గత రెండు నెలల క్రితమే రావాల్సి ఉన్నా.. బాహుబలి చిత్రంతో ఆగిపోయింది. కనీసం ఈ నెలలో రిలీజ్ చేయాలనుకున్నా శ్రీమంతుడు చిత్రంతో ఆగిపోయింది. ఇక వచ్చే నెల 4 న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అది కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. కారణం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాకపోవడమే. ఎప్పుడు విడుదలవుతుందనే విషయమై క్లారిటీ లేదు. సెప్టెంబర్ 11, లేదా సెప్టెంబర్ 18న విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అప్పుడు కూడా తమిళ సినిమా పులి పోటీలో ఉంది. రుద్రమ దేవి పోస్టర్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉండడంతో ఈ సినిమా చూడాలన్న కోరికతో అభిమానులు ఎదురు చూస్తున్నారు.