శ్రీను వైట్ల దర్శకత్వంలో రాంచరణ్ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం అఫీషియల్ టీజర్ ను చిరంజీవి బర్త్ డే కానుకగా విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. చిరంజీవి 60వ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం రాత్రి చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ చిత్రం డి.వి..వి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి కూడా ఓ గెస్ట్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు శ్రీను వైట్ల సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని కూడా తెలియజేశారు. ఈ చిత్రం క్లైమాక్స్ ను నాలుగు కోట్ల రూపాయలతో చిత్రీకరించారనే వార్త వినవచ్చింది. ఇదే విషయాన్ని దర్శకుడు, నిర్మాత అవునన్నట్టు కూడా తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్ర టీం బ్యాంకాక్ లోనూ, స్పెయిన్ లోని అందమైన లొకేషన్స్ లో రెండు పాటల షూటింగ్ ని పూర్తి చేసుకొని వచ్చారు. ఇప్పటి వరకూ జరిగిన పార్ట్ చాలా బాగా వచ్చినట్టు ఈ చిత్ర బృందం తెలుపుతోంది.