హన్సిక మళ్లీ ఓపెన్ చేస్తుంది.. రెడీ అయిపోండి

February 12, 2016 | 02:23 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Hansika-Painting-Exhibition-for-Helpless-Children-niharonline

బబ్లీ బ్యూటీ హన్సిక కోలీవుడ్ లో టాప్ హీరోయిన్. తెలుగులో అడపా దడపా చిత్రాలు చేస్తూ హిట్ ఖాతాలోనే జమచేసుకుంటుంది. తాజాగా చంద్రకళతో కూడా మంచి మార్కులే కొట్టేసింది. ఇక ఇప్పుడు మరోసారి హన్సిక ఫ్యాన్స్ పండగ చేసుకునేందుకు సిద్ధమైపోతున్నారు. తనలో ఉన్న టాలెంట్ ను మరోసారి బయట పెట్టేందుకు హన్సిక రెడీ అయిపోతుంది.

ఈ ముద్దుగుమ్మ ఎంత అందంగా వుంటుందో, అంత అందంగా బొమ్మలు కూడా గీస్తుందట. సినిమా హీరోయిన్ గా ఎంత బిజీ అయినప్పటికీ ఆమె ఆ హాబీని వదలలేదంట. తనకు ఖాళీ దొరికినప్పుడు .. మంచి మూడ్ వున్నప్పుడు కుంచె తీసుకుని పెయింటింగ్స్ వేస్తుంటుంది. అంతేకాదు, వాటిని అమ్మకానికి పెట్టి అలా వచ్చిన మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటుంది.

                      ఈమధ్య కాలంలో వేసిన పలు పెయింటింగ్స్ తో ఏకంగా ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయబోతుంది. వీటిని అమ్మటం ద్వారా వచ్చిన సొమ్మును ఓ అనాథాశ్రమానికి డొనేట్ చేసేందుకు సిద్ధమైపోతుంది. దీంతో తమ అభిమాన నటి గీసిన బొమ్మల్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకునే అభిమానులు డబ్బులు సిద్ధం చేసుకుంటారంట. ఇంకా ఆమెకు కృష్ణుడు అంటే ఎక్కువ ఇష్టం కావటంతో అందులో ఎక్కువ పెయింటింగ్స్ ఆ బొమ్మలే వుంటాయని చెబుతోంది. గతంలో కూడా ఆమె ఇలాగే తన పెయింటింగ్ ను ఓ ఎగ్జిబిషన్ లో ఉంచగా, అది కాస్త రికార్డు స్థాయిలో 15లక్షలకు అమ్ముడు పోయి ఆశ్చర్యపరిచింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ