బర్త్ డే స్పెషల్: బహుభాషా నటి సుమలత

August 27, 2015 | 12:20 PM | 3 Views
ప్రింట్ కామెంట్
sumalatha_birthday_niharonline

చూడగానే డీసెంట్ లుక్ తో ఆకట్టుకునే హీరోయిన్లలో మన తెలుగమ్మాయి సుమలతను చెప్పుకోవచ్చు.  ఈమె చెన్నయ్ లో సెటిలైన తెలుగు కుటుంబంలో పుట్టింది.(ఆగస్టు 27, 1963). 15 ఏళ్ళ వయసులో మిస్ ఆంధ్రప్రదేశ్ బ్యూటీ కాంటెస్ట్ లో గెలుపొంది, ఆ తరువాత వెంట వెంటనే సినిమా ఆఫర్లు చేజిక్కించుకుంది. ఈమె తమిళంలో మొదటి ఎంట్రీ (1979)ఇచ్చినప్పటికీ తెలుగు మొదటి సినిమా రాజాదిరాజు (విజయచందర్ హీరో-బాపు దర్శకత్వం), తరువాత కృష్ణతో సమాజానికి సవాల్ లో చేసింది.. తమిళ, కన్నడ, మళయళ, హిందీ, తెలుగు మొత్తం ఐదు భాషల్లో 200 చిత్రాలకు పైగా నటించింది. ఈమె మొత్తం ఆరు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. తెలుగులో ఎక్కువ సినిమాల్లో సైడ్ హీరోయిన్ గా చేసినప్పటికీ చాలా ఇంపార్టెంటెన్స్ ఉన్న రోల్స్ చేసి, అందరి మనసుల్లో చెదరని ముద్ర వేసుకుంది. సుమలత కె.విశ్వనాథ్ దర్శకత్వంలోని శుభలేఖ, శృతి లయల్లో చేసిన పాత్రలు ఎప్పటికీ మరిచిపోలేనివి. ఆమె నటనతో ఆ పాత్రలకు గౌరవాన్ని తెచ్చి పెట్టింది అన్నట్టుంటాయి. సుమలత చిరంజీవితో చేసిన మొదటి చిత్రం శుభలేఖ. అప్పట్లో ఆ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే... అందులో నటించిన వారందరూ అప్పుడప్పుడే ఎదుగుతున్న నటులు... ఆ తరువాత బాగా క్లిక్కయ్యారు కూడా. సుధాకర్ ఈ సినిమాలో మొదటిసారిగా నటించి శుభలేఖ సుధాకర్ అయ్యాడు. సుమలత ఆ తరువాత చిరంజీవితో చాలా సినిమాలే చేసింది అందులో ఖైదీ సినిమా ఒకటి ఇందులో కూడా సైడ్ హీరోయిన్ గా చేసినా, చాలా ఇంపార్టెన్స్ ఉన్న రోల్.  పసివాడి ప్రాణంలోనూ హీరోయిన్ గా నటించింది. గ్యాంగ్ లీడర్ లో శరత్ కుమార్ భార్యగా, చిరంజీవికి వదినగా నటించింది. రెండేళ్ళ క్రితం ‘బతుకు జట్కాబండి’ అనే టీవీ  షో సుమలత ఆధ్వర్యంలో సక్సెస్ ఫుల్ గా సాగింది.  దాదాపు 12 ఏళ్ళ పాటు సినిమాల్లో నటించి 1991, డిసెంబర్ 8న  సహ నటుడు అంబరీష్ ను పెళ్ళి చేసుకుంది. ఈమెకు ఓ కుమారుడు (అభిశేక్). అంబరీష్ తో  ఆహుతి, అవతార పురుష, శ్రీమంజునాథ, కల్లరలి హూగవి వంటి కన్నడ చిత్రాల్లో నటించారు. చాన్నాళ్ళ తరువాత నాగార్జున నటించిన బాస్ చిత్రంలో ఒక పాత్ర చేసింది. మొదటి సినిమా  తమిళ్ లో చేసినప్పుడు న్యూఫేస్ అవార్డును అందుకుంది. తరువాత తెలుగులో శృతిలయలు సినిమాకు (1987) బెస్ట్ యాక్ట్రెస్ ఎపీ నంది అవార్డు, ఫిల్మ్ ఫాన్స్ అవార్డు కూడా అందుకుంది. కృష్ణం రాజుతో నటించిన న్యూఢిల్లీ అనే సినిమా హిందీ, మలయాళం బెస్ట్ యాక్ట్రస్ అవార్డులును అందుకుంది. అప్పుడప్పుడూ తెలుగు సినిమా ఫంక్షన్లకు హాజరవుతూ ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో అభిమానులను అలరిస్తున్న సుమలత... సినిమాలకు దూరమైంది కానీ, తను నటిస్తే ఇప్పటికీ ఎగబడి చూసే అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ